calender_icon.png 13 February, 2025 | 12:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎం నివాసంలో కాంగ్రెస్ నేతల భేటీ

13-02-2025 01:14:15 AM

పార్టీ కార్యవర్గ కూర్పుపై చర్చ 

హైదరాబాద్, ఫిబ్రవరి 12 (విజయక్రాంతి): సీఎం రేవంత్‌రెడ్డి నివాసంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్ మున్షీ, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ బుధవారం భేటీ అయ్యారు. పీసీసీ కార్యవర్గ కూర్పుతో పాటు, స్థానిక సంస్థల ఎన్నికలు తదితర అంశాలపై చర్చించినట్టు సమాచారం. పార్టీ పదవుల కోసం పోటీ పడుతున్న వారి జాబితాను సిద్ధం చేసిన పీసీసీ చీఫ్.. సీనియర్ నాయకులు అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని  తయారు చేసిన జాబితాపై సీఎంతో చర్చించినట్టు పార్టీవర్గాలు తెలిపాయి.