04-04-2025 08:14:33 PM
తాడ్వాయి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలో శుక్రవారం సన్న బియ్యం కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రారంభించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో నిరుపేదలకు రేషన్ దుకాణాల ద్వారా సన్న బియ్యం పంపిణీ చెయ్యాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిందన్నారు. ప్రతి పేదవారు సన్నబియ్యం తినాలని ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ రహీముద్దీన్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వెంకటరెడ్డి నియోజకవర్గ ఎస్సీ సెల్ విభాగం అధ్యక్షులు గైని శివాజీ, సంజీవులు, రాజు తదితరులు పాల్గొన్నారు.