23-03-2025 03:45:25 PM
జుక్కల్,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలోని మాదాపూర్ గ్రామంలో ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు ఆదేశాల మేరకు ఆదివారం సీసీ రోడ్డు పనులను కాంగ్రెస్ నాయకులు ప్రారంభించారు. గ్రామంలో రూ.25 లక్షల నిధులు మంజూరు అయ్యాయని వారు తెలిపారు. సుమారుగా 500 మీటర్ల వరకు సీసీ రోడ్డు పనులు చేపడుతున్నట్లు వారు చెప్పారు.కాంగ్రెస్ ప్రభుత్వం తోనే గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి చెందుతాయని వారు అన్నారు. ప్రతి గ్రామాల్లో సంక్షేమ అభివృద్ధి పథకాలు సమర్ధవంతంగా అమలు అవుతాయని అన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు అయిలావర్ రమేష్. మాజీ తాజా సర్పంచ్ రమేష్ దేశాయ్. రాజు పటేల్ దిలీప్ పటేల్, సతీష్ పటేల్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.