బీఆర్ఎస్ నేతల హెచ్చరిక...
పటాన్ చెరు: కాంగ్రెస్ నాయకులారా నోరును అదుపులో పెట్టుకోండి లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని బీఆర్ఎస్ నాయకులు హెచ్చరించారు. బొల్లారం మున్సిపల్ లో మంగళవారం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ నాయకులు వ్యవహరించిన తీరుపై, మీడియా సమావేశంలో బీఆర్ఎస్ నాయకుడు బాల్ రెడ్డిపై నోరు జారడాన్ని వారు తీవ్రంగా పరిగణించారు. బుధవారం బొల్లారం మున్సిపల్ పట్టణంలోని మాజీ జెడ్పిటిసి కొలను బాల్ రెడ్డి నివాసంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాజేష్ వివిధ గ్రామాల సర్పంచులు, కౌన్సిలర్లతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ లో ఏర్పడిన గ్రూపులను ముందు సరిచేసుకోండని, మీలో మీకు ఏర్పడిన గ్రూపు తగాదాలతో బీఆర్ఎస్ నాయకులను విమర్శిస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు బీరప్ప, రత్నం, మాజీ సర్పంచులు జనార్ధన్, శివరాజ్, ఆంజనేయులు, మాజీ ఎంపీటీసీ భార్గవ్, నాయకులు సారా నరేందర్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.