29-04-2025 06:47:05 PM
హనుమకొండ (విజయక్రాంతి): వర్ధన్నపేట ఎమ్మెల్యే కే ఆర్ నాగరాజు(MLA K.R. Nagaraju) ఆదేశాల మేరకు రోడ్డు మరమ్మతులను పరిశీలించిన డివిజన్ అధ్యక్షులు కనపర్తి కిరణ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు హసన్ పర్తి ఎమ్మార్వో ఆఫీస్ నుండి ఎల్లాపూర్ వరకు నిత్యం రోడ్డు ప్రమాదాలు జరుగుతుండేవి వీటికి శాశ్వత పరిష్కారంగా ఎమ్మెల్యే వెంటనే స్పందించి రోడ్డు ప్రమాదాల నుండి కాపాడేందుకు తక్షణమే 2 కోట్ల నిధులు కేటాయించగా, ఈరోజు అధికారులకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు పలు సలహాలు సూచనలు చేశారు.
ఈ రోడ్డు మార్గంలో సెంట్రల్ లైటింగ్, డివైడర్ల కోసం 2 కోట్ల రూపాయలతో పనులు జరుగుతున్న సందర్భంగా పర్యవేక్షించారు. గత పాలకులు 10 సం.లుగా ఎన్నో ప్రమాదాలు జరిగిన పట్టించుకున్న పాపాన పోలేదు కాని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ప్రజల ప్రాణాలను దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరకు తీసుకెళ్లి నిధులు తీసుకొస్తే బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు మేము తీసుకొచ్చామని చెప్పుకోవడం చాలా సిగ్గు చేటు అన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ మాజీ డైరెక్టర్ వీసం సురేందర్ రెడ్డి, దేవస్థాన మాజీ చైర్మన్ జన్ను రవీందర్, మాజీ జడ్పిటిసిలు ఇంజమూరి వెంకటేశ్వర్లు, పోతరాజు ప్రభాకర్, కోడల మురళి, పెద్దమ్మ రామ్ నర్సింహులు, యూత్ అధ్యక్షులు తాళ్ల మధు, బోయిని శశికాంత్, సోషల్ మీడియా కోఆర్డినేటర్ బిగుళ్ల సురేష్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.