calender_icon.png 1 April, 2025 | 11:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ నేతలకు కరప్షన్ వెరస్ సోకింది

31-03-2025 12:00:00 AM

వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును పార్లమెంట్ లో ఆమోదం పొందడం తథ్యం

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిబండి సంజయ్ కుమార్

కరీంనగర్, మార్చి30(విజయక్రాంతి):ఈ ఏడాది దొంగతనాలు ఎక్కువైతాయని, ప్రజాప్రతినిధులు,అధికారులు విచ్చలవిడిగా అవినీతికి పాల్పడతారని, కొత్త వ్యాధి ప్రబలుతుందని కూడా జ్యోతిష్య పండితులు చెబుతున్నారని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ అన్నారు.

ఉగాది పర్వదినం సందర్బంగా కరీంనగర్ లోని తన నివాసగృహం లో ఏర్పటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనను గమనిస్తే జ్యోతిష్య పండితులు చెప్పేది నిజమేనన్పిస్తోందిని, ఏ శాఖలో చూసినా అవినీతి రాజ్యమేలుతోందన్నారు. కాంగ్రెస్ నేతలకు ‘కరప్షన్ వైరస్’ సోకిందిని  అన్నారు.

కాంట్రాక్టుల దగ్గర నుండి పెండింగ్ బిల్లుల వరకు ప్రతి దాంట్లోనూ కమీషన్లు ఇవ్వనిదే పనిచేయడం లేదన్నారు. కాంగ్రెస్ కు కరప్షన్ వైరస్’  సోకడం మూలంగా అన్ని వర్గాల ప్రజలు బాధలు పడుతున్నారన్నారు బీఆర్‌ఎస్ 10 ఏళ్ల పాలనలో ‘పింక్ వైరస్’ సోకి తెలంగాణ ప్రజలు నష్టపోయారని, బీజేపీ చేసిన పోరాటాలవల్ల పింక్ వైరస్  పీడ విరిగిందిని తెలిపారు. పోరాటాలనే వ్యాక్సిన్ గా కాంగ్రెస్ అవినీతిపై యుద్దం చేయబోతున్నారు.

రేషన్ బియ్యం ఖర్చంతా కేంద్రమే భరిస్తోందిని, రేషన్ షాపులతోపాటు అంతటా ప్రధాని ఫోటోలు కూడా పెట్టాల్సిందే అన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసును పూర్తిగా నీరుగారుస్తున్నారని, శ్రవణ్ రావు సహా అందరికీ బెయిల్ వచ్చేలా  కాంగ్రెస్సే సహకరిస్తోందన్నారు. కేసీఆర్ కుటుంబాన్ని కాంగ్రెస్ కాపాడుతోందన్నారు. దేశాన్ని విభజిస్తామంటూ బీఆర్‌ఎస్ నేతలు అవాకులు పేలుతూ దేశద్రోహానికి పాల్పడుతున్నారని విమర్శించారు.

జీహెచ్‌ఎంసీ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పోటీకి దూరంగా ఉంటూ మజ్లిస్ ను గెలిపించేందుకు సిద్ధమైనయని, మరి కొద్దిరోజుల్లో ఆ ఈ పార్టీల అసలు రంగు బయటపడబోతోందన్నారు. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుపై అందరి అభిప్రాయాలను తీసుకున్నామని, అతి త్వరలోనే వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును పార్లమెంట్ లో ఆమోదం పొందడం తథ్యం అన్నారు.

ఆర్‌ఎస్‌ఎస్ దేశభక్తి కలిగిన పార్టీ... ఈ దేశ ధర్మం, సనాతన ధర్మం, హిందూ సమాజ సంఘటితం చేసేందుకు నిరంతరం క్రుషి చేస్తూ అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న సంస్థ ఆర్‌ఎస్‌ఎస్ అన్నారు. ఒవైసీ ఆసుపత్రిలో ఉగ్రవాదులు దొరి కారు... దారుస్సలాం టెర్రరిస్టులకు అడ్డాగా మారిందన్నారు. అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి అమ్ముడుపోయే పార్టీ మజ్లిస్ అని విమర్శించారు. విలేకరుల సమావేశంలో మాజీ మేయర్ సునీల్ రావు, మాజీ ఎంపిపి వాసాల రమేష్ పాల్గొన్నారు.