calender_icon.png 27 December, 2024 | 3:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోడ్డు మరమ్మతులో కాంగ్రెస్ లీడర్లు

28-10-2024 12:06:29 AM

వికారాబాద్ రూరల్, అక్టోబర్ 27(విజయక్రాంతి): అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ ఆదేశాల మేర కు కోట్‌పల్లి మండలంలోని జిన్నారం గేట్ నుంచి రాళ్లచిట్టెంపల్లి వరకు ఆదివారం నిర్వహించిన రోడ్డు మరమ్మ తు కార్యక్రమంలో కాంగ్రెస్ లీడర్లు పాల్గొన్నారు. భారీ వర్షాల కారణంగా 15 కిలోమీటర్ల మేర ఉన్న ఈ రోడ్డుపై గుంతలు పడ్డాయి. దీంతో ఈ రోడ్డు గుండా వెళ్లేవారు ఇబ్బందులు పడుతున్నారు.

ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు స్వచ్ఛందంగా రోడ్డు మరమ్మతులు చేపట్టారు. కోట్ పల్లి కాంగ్రెస్ మండలాధ్యక్షుడు నర్సింగ్‌నాయక్, ఎస్సీసెల్ మండలాధ్యక్షుడు శశికాంత్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మహేశ్ రెడ్డి, డాక రాజేశ్వర్‌రెడ్డి, మల్లేశం, అక్బర్ పాల్గొన్నారు.