ముత్తారం,(విజయక్రాంతి): ముత్తారం మండలంలోని పోతారం పోతారం గ్రామ సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకడు చెలకల జితేందర్ యాదవ్ తల్లి పాపమ్మ అనారోగ్యంతో తెల్లవారుజామున మృతి చెందింది. విషయం తెలుసుకున్న మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పోతారం గ్రామంలో వెళ్లి పాపమ్మ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసి, ఆమె అంత్యక్రియలలో పాల్గొని పాడే మూశారు. కుటుంబ సభ్యులను మన ధైర్యం కల్పించారు.
ఈ అంత్యక్రియలలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు మాజీ జడ్పీటీసీ చొప్పరి సదానందం, మండల అధ్యక్షులు దొడ్డ బాలాజీ, సింగిల్ విండో చైర్మన్ అల్లాడి యాదగిరిరావు, కాంగ్రెస్ పార్టీ మహిళా మండల అధ్యక్షురాలు గోవిందుల పద్మ ఆనంద్, యూత్ మండల అధ్యక్షుడు బక్కతట్ల వినీత్ యాదవ్, జిల్లా ఎస్పీ సెల్ ఉపాధ్యక్షుడు మద్దెల రాజయ్య, మాజీ అధ్యక్షులు బియ్యాని శివకుమార్, నాయకులు గాదం శ్రీనివాస్, కోల విజయ్ గౌడ్, పంజాల కుమారస్వామి, యాదవ సంఘం మండల అధ్యక్షుడు కాసు తిరుపతి యాదవ్, నాయకులు సింగనమైన సదయ్య, మ్యారేడిగొండ రాజయ్య యాదవ్, తదితరులు పాల్గొన్నారు.