calender_icon.png 11 January, 2025 | 8:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎమ్మెల్యేను తప్పుదోవ పట్టించి నిధులను మళ్లిస్తున్న కాంగ్రెస్ నాయకులు

11-01-2025 05:49:28 PM

బెల్లంపల్లి,(విజయక్రాంతి): బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్(Bellampally MLA Gaddam Vinod)ను స్థానిక కాంగ్రెస్ నాయకులు(Congress Leaders) తప్పుదోవ పట్టించి గత ప్రభుత్వం మహిళా సమాఖ్య భవనాలకు(Women Federation Buildings) కేటాయించిన నిధులను సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి మళ్లించుకుంటున్నారని బిఆర్ఎస్ బెల్లంపల్లి నియోజకవర్గ అధికార ప్రతినిధి కొమ్మెర లక్ష్మణ్, సీనియర్ నాయకులు రామగోని అశోక్ గౌడ్ లు ఆరోపించారు. శనివారం బెల్లంపల్లి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు.

గత ప్రభుత్వం మహిళా సమాఖ్య భవనాలు, నూతన గ్రామపంచాయతీ కార్యాలయాల కోసం మంజూరు చేసిన నిధులను వాటికేటాయించాలని డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య హయాంలో బెల్లంపల్లి మండలంలోని చంద్రవెల్లి, భూదాకలన్, పెరిక పల్లి, అంకుశం, సోమ గూడెం పంచాయతీల్లో 1/24/డి ఎం ఎఫ్ టి/బిపిఎల్ కింద ఒక్కో నిర్మాణానికి రూ 18 లక్షల నిధులను కేటాయించినట్లు చెప్పారు. మహిళా సమాఖ్య భవనాలు, గ్రామపంచాయతీ కార్యాలయాలకు కేటాయించడం కాంగ్రెస్ హయాంలో సిసి రోడ్లకు మళ్లించడం సరైంది కాదన్నారు. ఈ విషయంపై తాము జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తామన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో బెల్లంపల్లి నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే గడ్డం వినోద్ ఎక్కడ కృషి చేసింది లేదని విమర్శించారు. దీనిపై బి ఆర్ ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పట్టణంలో ఎక్కడైనా తాము చర్చకు సిద్ధంగా ఉన్నామని సవాల్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టిడిపి పార్టీలో సీనియర్ నాయకులను తొక్కుకుంటూ కాంగ్రెస్ పార్టీలో ఎదిగిన విషయం ప్రజలకు తెలుసన్నారు. పోలీసు నిర్బంధాలకు భయపడేది లేదని వారు చెప్పారు గత ప్రభుత్వం కార్మికులకు విద్యుత్ సౌకర్యం, త్రాగునీటి సౌకర్యం కల్పించిందని గుర్తు చేశారు. బెల్లంపల్లి కార్మిక కాలనీలో కూడా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసేలా ఎమ్మెల్యే గడ్డం వినోద్ కృషి చేయాలని వారు కోరారు.

శివాలయం ఎదురుగా గల సింగరేణి స్థలంలో సోలార్ ప్లాంట్ కోసం సిద్ధం చేసిన స్థలాన్ని పేదలకు పంచాలని ప్రతిపాదనను తాము స్వాగతిస్తున్నామని, అయితే ఈ స్థలంలో ఉపాధి కోల్పోయిన గౌడ కులస్తులకు ప్రత్యామ్నాయ ఉపాధి ఏర్పాట్లను కల్పించేలా ఎమ్మెల్యే వినోద్ చొరవ చూపాలని డిమాండ్ చేశారు. శాంతిఖని గని 2 ఇంక్లైన్ ఓసి అడ్డుకుంటామన్నారు. ఓసీని ఏర్పాటు చేస్తే కార్మిక సంఘాలు చూస్తూ ఊరుకోవన్నారు. ఈ సమావేశంలో బెల్లంపల్లి మండల మాజీ సర్పంచులు ఇండ్ల రాజమౌళి, కారుకూరి వెంకటేష్, వేముల కృష్ణమూర్తి, బీఆర్ఎస్ నాయకులు మల్లేష్ (ఆర్. పి), శ్రీనివాస్ గౌడ్, బాకం సుమన్ లు పాల్గొన్నారు.