గందరగోళంలో వాహనదారులు...
కల్వకుర్తి: రోడ్డు ప్రమాదాలను నిలువరించేందుకు పోలీస్ అధికారులు పట్టణంలోని ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేశారు. కానీ స్థానిక కాంగ్రెస్ నేతలు తమ స్వార్థం కోసం తమ నాయకుడి పుట్టినరోజు వేడుకల సందర్భంగా ట్రాఫిక్ సిగ్నల్స్ అడ్డుగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే ప్రధాన రహదారిలో తరచూ రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్న సంబంధిత అధికారులు బాధ్యత గల ప్రజాప్రతినిధులు సైతం తమ స్వార్థం కోసం ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మున్సిపాలిటీలో ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే విచ్చలవిడిగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తూ మున్సిపల్ ఆదాయానికి గండి కొడుతూనే ప్రమాదాలు జరిగే విధంగా ట్రాఫిక్ సిగ్నల్స్ అడ్డుగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడంపై ఆయా శాఖల అధికారుల అలసత్వాన్ని ఎత్తిచూపుతోందని ప్రచారం జరుగుతోంది.