29-04-2025 12:51:04 AM
బీఆర్‌ఎస్‌పై కాంగ్రెస్ నేతల ఫైర్
ఖమ్మం, ఏప్రిల్ 28( విజయక్రాంతి ):-కేసీఆర్ మాటలలో పస లేదు... గాలి మాటలు జోరుగా మాట్లాడుతున్నారు..ఆడలేక మద్దెల దరువు అన్న చందంగా కేసీఆర్ తీరు ఉందని జిల్లా కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు. జిల్లా కాంగ్రెస్ కార్యాలయం సంజీవ్ రెడ్డి భవన్ లో సోమవారం జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశం అనంతరం మీడియా తో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు దొబ్బ ల సౌజన్య మాట్లాడారు.ముద్దుల బడ్జెట్తో రా ష్ట్రాన్ని అప్పజెప్పితే 10 ఏళ్లలో రాష్ట్రాన్ని విధ్వoసం చేసి, నిధులు దుర్వినియోగం చేసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన మీరు ఈనాడు సభ పెట్టి బొంకులు బొంకుతున్నారని ఫైర్ అయ్యారు.
మహిళలకు ఉచిత బ స్సు కార్యక్రమాన్ని హేళన చేసి మాట్లాడతారా అని అన్నారు.మహిళల పట్ల ఏమా త్రం గౌరవ ఉందో అర్థం అవుతుందన్నారు. ఆర్థిక శాఖ గురించి మాట్లాడుతున్న మీరు ఆనాడు మీ ప్రభుత్వంలో ఆర్థిక శాఖను నిర్వీర్యం చేసి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసింది మీరు కాదా అని ప్రశ్నించారు.తెలంగాణ రాష్ట్ర ప్రజలు పదేళ్ల దొర పాలనను అంతమొందించి, ప్రజా ప్రభుత్వాన్ని తెచ్చుకుంటే ఈనాడు సభ పెట్టి కల్లబొల్లి మాటలు చెబితే నమ్మడానికి ఎవరూ సిద్ధంగా లేరని అన్నారు.
అనేక పథకాలతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా బడుగు బలహీన వర్గాల ప్రజలకు రైతులకు, అన్నివర్గాల ప్రజలకు అండగా ఉంటూ ప్రజాస్వామ్య పద్ధతిలో పరిపాలిస్తున్నదని అన్నారు. జిల్లాకు చెందిన మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే లు విమర్శలు మాని ప్రజాస్వామ్య యుతంగా పరిపాలిస్తున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి మంచి సలహా సూచనలు ఇవ్వాలని హితవు పలికారు.ఈ కార్యక్రమంలో పి సి సి సభ్యులు, జిల్లా ఓబీసీ సెల్ అద్యక్షులు పుచ్చకాయల వీరభద్రం, జిల్లా, ఓబీసీ సెల్ ఉపాద్యక్షులు గజ్జి సూర్యనారాయణ, జిల్లా కాంగ్రెస్ నాయకులు మద్ది వీరారెడ్డి,యాస శ్రీశైలం, రజీ భాయ్,ఎన్ ఎస్ యు ఐ నాయకులు ఖైజర్, యశ్వంత్ తదితర నాయకులు పాల్గొన్నారు.