calender_icon.png 2 April, 2025 | 8:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేదలందరికీ నాణ్యమైన సన్న బియ్యాన్ని అందించడమే ప్రభుత్వ లక్ష్యం

01-04-2025 12:51:59 PM

ఎల్లారెడ్డి,(విజయక్రాంతి): పేద ప్రజలందరికీ నాణ్యమైన సన్నబియ్యాన్ని అందించడమే  సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యమని ఎల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు  వినోద్ గౌడ్, మండల అధ్యక్షులు కురుమ సాయిబాబాలు అన్నారు. మంగళవారం ఎల్లారెడ్డి పట్టణంలోని లింగారెడ్డిపేట్  రేషన్ షాప్ లో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పేదలకు సన్నబియ్యం  పంపిణీ కార్యక్రమాన్ని  వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... సీఎం రేవంత్ రెడ్డి ఉగాది పండుగ సందర్భంగా హుజూర్ నగర్ లోని సీఎం రేవంత్ రెడ్డి సన్నబియ్యం పంపిణీ కార్యక్రమానికి ప్రారంభించారని.

ఇప్పటివరకు రేషన్ షాపులలో పంపిణీ చేస్తున్న దొడ్డు బియ్యాన్ని లబ్ధిదారులు తినకుండా అమ్ముకుంతడంతో ప్రభుత్వ లక్ష్యం నెరవేరడం లేదని ప్రభుత్వం గుర్తించిందని అన్నారు. సన్న బియ్యం పండించే రైతులను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 500 రూపాయల బోనస్  చెల్లిస్తుండడంతో సన్నధాన్యం రైతులు  పండించేందుకు ఆసక్తి చూపుతున్నారని అన్నారు. పేద ప్రజల దృష్టిలో పెట్టుకొని సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టిన సీఎం రేవంత్ రెడ్డికి, ఎల్లారెడ్డి స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు వినోద్ గౌడ్, మండల కాంగ్రెస్ అధ్యక్షులు కురుమ సాయిబాబా, సొసైటీ వైస్ చైర్మన్ ప్రశాంత్ గౌడ్, సొసైటీ డైరెక్టర్ అధికార ప్రతినిధి నాగం గోపికృష్ణ, మాజీ వైస్ ఎంపీపీ నునుగొండ శ్రీనివాస్, మాజీ జడ్పిటిసి సామిల్, కాంగ్రెస్ పార్టీ నాయకులు శంకర్, విద్యాసాగర్,సుజిత్, శేకావత్ అలీ, తదితరులు పాల్గొన్నారు.