calender_icon.png 18 April, 2025 | 12:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చేగుంట పోలీస్ స్టేషన్లో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డిపై కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదు

15-04-2025 04:58:40 PM

చేగుంట (విజయక్రాంతి): మెదక్ జిల్లా చేగుంటలో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డిపై కాంగ్రెస్ నాయకులు చేగుంట పోలీస్ స్టేషన్ లో కాంగ్రెస్ ప్రభుత్వంపై సిద్దిపేట్ జిల్లా తోగుట మండల్ తుక్కాపూర్ గ్రామంలో ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు ఎంత డబ్బైనా ఇస్తాము, ఎమ్మెల్యేలను కోనమని చెప్పారని మాట్లాడడం జరిగిందని, ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, పడగొట్టడానికి, కూల్చివేయడానికి ఆయన చేసిన వ్యాఖ్యలు, రాజ్య ద్రోహం కింద వస్తాయి, అత్తన్ని వెంటనే అరెస్ట్ చేయాలని, ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్, మండల కోఆర్డినేటర్ జనగామ మల్లారెడ్డి, జనరల్ సెక్రటరీ కొండి శ్రీనివాస్, ఓబీసీ అధ్యక్షులు అన్నం ఆంజనేయులు, ఎస్సి సెల్ అధ్యక్షులు స్టాలిన్ నర్సిములు, కాంగ్రెస్ నాయకులు సండ్రుగు శ్రీకాంత్, దుబ్బాక యూత్ ఉపాధ్యక్షులు సాయికుమార్ గౌడ్, మండల యూత్ అధ్యక్షులు మోహన్ నాయక్, బాలరెడ్డి, బాస రాజు, సబ్బని శ్రవణ్ పాల్గొన్నారు.