calender_icon.png 2 April, 2025 | 7:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ నాయకులు

31-03-2025 06:26:41 PM

రైల్వే స్టేషన్ వద్ద అలయ్ బలయ్ కార్యక్రమం ఏర్పాటు..

కొత్తగూడెం (విజయక్రాంతి):  ఈ ప్రపంచంలో సర్వ మతాల సారాంశం ఒక్కటేనని, సర్వ ధర్మాలు జీవకోటి పరిరక్షణ కోసం తోడ్పాటును అందిస్తాయని అన్నారు. భద్రాద్రి జిల్లా కొత్తగూడెం రైల్వే స్టేషన్ వద్ద రంజాన్ పండుగను పురస్కరించుకుని, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు ఆళ్ళ మురళి కాంగ్రెస్ శ్రేణులతో కలిసి ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ అలైబలై చేసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అన్ని మత గ్రంథాల సారాంశం, వాటి ధర్మాలు ఒకటేనని తెలిపారు. రంజాన్ మాసంలో నెల రోజులపాటు జడ్పి ఉపవాస దీక్షలో ఎంతో మహత్యం ఉంటుందని, వాటి వల్ల మానవాళి ప్రశాంతమైన జీవనం కొనసాగిస్తారని పేర్కొన్నారు.

పేదలను ఆదుకోవడం, దానధర్మాలు చేయడం ఈ మాసం ప్రత్యేకత అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఊకంటి గోపాల్ రావు, మాజీ జెడ్పి చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్ రావు, కోనేరు పూర్ణ, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు తోట దేవిప్రసన్న, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు చీకటి కార్తీక్, నియోజకవర్గ అధ్యక్షులు సత్యనారాయణ రెడ్డి, ఐఎన్టియూసి కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ పీతాంబరం, కేకే శ్రీను, రైల్వే బోర్డు మెంబర్ శ్రీనివాస్ రెడ్డి, సుందర్ రాజ్, మసూద్, తలుగు అనిల్, పల్లపు వెంకటేశ్వర్లు, బాల పాసి, యూత్ కాంగ్రెస్ శ్రేణులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.