calender_icon.png 8 April, 2025 | 3:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణి చేసిన కాంగ్రెస్ నాయకులు

07-04-2025 01:59:50 PM

 చేగుంట, విజయక్రాంతి: దుబ్బాక కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి(Cheruku Srinivas Reddy) చొరవతో  మండల అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్, యూవ నాయకులు సండ్రుగు శ్రీకాంత్ ఆధ్వర్యంలో రెడ్డి పల్లి, చిన్న శివనూర్ గ్రామంలో  సీఎంఆర్ఎఫ్  చెక్కులు పంపిణీ చేసిన నాయకులు, రెడ్డిపల్లి గ్రామానికి చెందిన బోండ్ల రంజీత్ 37500 రూపాయలు, చిన్న శివనూర్ గ్రామానికి చెందిన  కమ్మరి వెంకటేశం  28000 రూపాయలు  సీఎం రిలీఫ్ ఫండ్  చెక్కులను అందించడం జరిగింది.

బాధితులు మాట్లాడుతూ... మాలాంటి పేదవారికి  ఇలాంటి పథకాల ద్వారా మాకు ఎంతో కొంత సహాయం అందించినందుకు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ చెక్కి శ్రీనివాస్ రెడ్డి, మండల అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్, యూవ నాయకులు సండ్రుగు శ్రీకాంత్ కి, మాకు చెక్కులు రావడానికి సహకారంఅందించిన గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులకు నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ ఎస్సి సెల్ అధ్యక్షులు స్టాలిన్ నర్సింలు, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మోహన్ నాయక్ ,యువ నాయకులు సండ్రుగు శ్రీకాంత్ దుబ్బాక అసెంబ్లీ యువజన ఉపాధ్యక్షులు బొల్ల ప్రశాంత్ రెడ్డిపల్లి గ్రామ అద్యక్షులు చిన్నశేన్న నర్సింలు గ్రామ నాయకులు సత్యం, తిగుళ్ళ దామోదర్, తలారి జ్ఞానేశ్వర్, తలారి వెంకటేష్, మంద నర్సింలు, తిగుళ్ల కృష్ణ, గాండ్ల పవన్, తదితరులు పాల్గొన్నారు