calender_icon.png 14 November, 2024 | 4:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాధిత కుటుంబాలకు కాంగ్రెస్ నాయకులు పరామర్శ

12-11-2024 12:01:04 PM

ముత్తారం (విజయక్రాంతి): ముత్తారం మండలంలోని అడవి శ్రీరాంపూర్ గ్రామంలో ఇటీవల మరణించిన గాధర్ల హరీష్, రామగిరి స్వామి, అల్లంల ఐలయ్య కుటుంబాలను మంగళవారం  కాంగ్రెస్ పార్టీ నాయకులు పరామర్శించారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు చొప్పరి సదానందం, ముత్తారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొడ్డ బాలాజీలు మైనార్టీ సెల్ అధ్యక్షులు వాజిక్ పాషా బాధితుల ఇంటికి వెళ్లి మృతుల చిత్రపటాలకు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. వారి వెంట కాంగ్రెస్ సీనియర్ నాయకులు, దేశ్ని రాజేశం, బల్లయ్య, రామ్ రాజయ్య, అశోక్ చారి, శశి కుమార్, మదన్, సదయ్య, రమేష్, బర్ల రాజు, తిరుపతి, దహరవి, రాజు, అడవి శ్రీరాంపూర్ యూత్ అధ్యక్షులు అంజి, యూత్ నాయకులు స్వామి, సంతోష్, పవన్ కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.