calender_icon.png 8 January, 2025 | 8:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మృతురాలి కుటుంబానికి కాంగ్రెస్ నాయకుల పరామర్శ

07-01-2025 09:56:13 PM

ముత్తారం (విజయక్రాంతి): ముత్తారం మండలంలోని జిల్లాలపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గడ్డం రాజేశం కూతురు సంధ్య ఇటీవల భర్త చేతులో మృతి చెందగా, మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు మంగళవారం వారి ఇంటికి వెళ్లి కుటుంబాన్ని మండల కాంగ్రెస్ నాయకులు పరామర్శించారు. ఆమె చిత్ర పటానికి పూలమాలవేసి మాజీ జడ్పిటిసి చొప్పరి సదానందం, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు దొడ్డ బాలాజీలు ఘనంగా నివాళులర్పించారు. సంధ్య కుటుంబానికి అండగా ఉంటామని తండ్రి రాజేష్ కు ధైర్యం చెప్పారు. వారి వెంట మైనార్టీ సెల్ మండల అధ్యక్షులు వాజిద్ పాషా, బీసీ సెల్ మండల అధ్యక్షుడు అల్లం కుమార్ స్వామి, మాజీ ఉపసర్పంచ్ జన్నే శ్రీకాంత్, చొప్పరి శ్రీకాంత్, గడ్డం శంకర్, గడ్డం గట్టయ్య, జన్నే రాంచందర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.