calender_icon.png 15 January, 2025 | 10:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పది తరాలు ప్రజలు చల్లగా ఉండాలని కోరుకునే శ్రీధర్ బాబు

17-07-2024 07:31:33 PM

మంథని: పది తరాలు పంథని ప్రజలు చల్లగా ఉండాలని కోరుకునే  నాయకుడు మంత్రి శ్రీధర్ బాబు అని,  అయితే 10 తరాలకు సరిపడా సంపాదించుకున్న నాయకుడు పుట్ట మధుకర్ అని కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు చొప్పరి సదానందం, మండల పార్టీ అధ్యక్షుడు బాలాజీలు అన్నారు.  బుధవారం వారు ముత్తారంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పుట్ట మధు  రాజ గృహలో విలేకరుల సమావేశం పెట్టి మతిస్థిమితం కోలిపోయి మతి లేని మాటలు మాట్లాడుతూ పిచ్చి ప్రేరేపనలు చేస్తూ ఫ్యాక్షన్ రాజకీయాలకు పురుడు పోసుకునే విధంగా మాట్లాడుతున్నారని అన్నారు.

మంథనిలో మున్సిపాలిటీ కార్యాలయం కట్టితే దాన్ని రాజకీయం చేయడం సరికాదన్నారు ఇక్కడే పుట్టిన నాయకుడు కావాలంటున్నావు కాదా.... మరి మీ కేసీఆర్ మీ కేటీఆర్ హరీష్ రావులు ఎక్కడ పుట్టారు ఎక్కడ పోటీ చేశారని మండిపడ్డారు. మా నాయకుడు మంథనిలో పుట్టి మంథనిలోనే పోటీ చేశాడన్నారు.  పచ్చకామర్లు ఉన్నవారికి లోకం పచ్చగానే కనబడుతుంది అనేదానికి నిదర్శనం పుట్ట మధుకర్ దంపతులే అని అన్నారు. తక్కువ కాలంలో మంథనికి రూ. 1000 కోట్ల రూపాయల నిధులు తెచ్చి అభివృద్ధి చేసింది మంత్రి శ్రీధర్ బాబు అన్నారు.

మీలాగా ఓడేడు, ఖమ్మంపల్లి మానేరు బ్రిడ్జిలపై అదేవిధంగా ప్రాజెక్టులపై కమిషన్ లు తీసుకొని కోట్లాది రూపాయలు సంపాదించలేదన్నారు.  మీరు అవినీతి చేసి మా నాయకుడిని అవినీతిపరుడు అని అంటే ప్రజలే తాట తీస్తారని హెచ్చరించారు.  ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు మద్దెల రాజయ్య, ముత్తారం తాజా మాజీ సర్పంచ్ తుటీ రజిత రఫీ, నాయకులు అనుము సమ్మయ్య, బక్కతట్ల కుమార్, బుచ్చం రావు, గాదం శ్రీనివాస్, జక్కుల రమేష్, వెల్మరెడ్డి సంజీవరెడ్డి, తాటిపాముల శంకర్, ఆకోజ్, అశోక్, రాపల్లి సురేందర్, బోడ రత్నాకర్, కుక్కల చెందు, చల్ల సది, పాశం మొగిలి తదితరులు పాల్గొన్నారు.