17-03-2025 02:04:30 AM
కరీంనగర్, మార్చి 16 (విజయ క్రాంతి): టిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కేటీఆర్, జగదీష్ రెడ్డిల దిష్టిబొమ్మలను ఆదివారం నగరంలోని తెలంగాణ చౌక్ లో నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో దహనం చేశారు. ఈ సందర్భంగా నగర కాంగ్రెస్ అధ్యక్షుడు, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ బిఆర్‌ఎస్ పార్టీ నాయకులు దళిత నాయకుల పట్ల దళిత ప్రజా ప్రతినిధుల పట్ల అనుచితంగా,అమర్యాదగా, అవమానపరిచే విధంగా ప్రవర్తిస్తున్నారని అన్నారు. మొన్న అసెంబ్లీలో స్పీకర్ ప్రసాద్ కుమార్ పట్ల ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి ఏకవచనంతో మాట్లాడి సభా మర్యాదను మంటగలిపారని, గతంలో ఎమ్మెల్యే సంపత్ కుమార్ ను అసెంబ్లీ నుంచి బర్తరఫ్ చేశారని అన్నారు.
లోక్ సభ స్పీకర్ గా తెలంగాణ బిల్లు పాస్ చేసిన మీరా కుమార్ తెలంగాణకు వచ్చి కేసీఆర్ అపాయింట్మెంట్ అడిగితే ఇవ్వలేదని, ఆనాడు సిరిసిల్ల నియోజక వర్గం నేరెళ్ల గ్రామ దళిత కుటుంబానికి చెందిన వారు ఇసుక లారీల టైర్ల కింద పడి మరణించితే ఆకుటుంబాలను పరామర్శించడానికి, ఆనాడు పోలీసుల ద్వారా థర్డ్ డిగ్రీ ప్రయోగించి ఇబ్బందులకు గురి చేసిన దళిత కుటుంబాలను పరామర్శించడానికి మీరా కుమార్ నేరెళ్లకు వెళితే అరెస్ట్ చేశారని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక దళిత నాయకున్ని ముఖ్యమంత్రి చేస్తానని మోసం చేశారని ఇలా అనేక రకాలుగా దళితుల పట్ల బిఆర్‌ఎస్ నాయకులు అవలంబిస్తున్న వైఖరికి నిరసనగా వారి దిష్టి బొమ్మలు దహనం చేశామని ఇప్పటికైనా పద్దతి మార్చుకోకపోతే బిఆర్‌ఎస్ నాయకులను తరిమికొట్టే రోజు వస్తుందని నరేందర్ రెడ్డి హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో అసెంబ్లీ ఇంచార్జ్ పురుమల్ల శ్రీనివాస్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు కొరివి అరుణ్ కుమార్, నాయకులు గుండాటి శ్రీనివాస్ రెడ్డి, ఆకారపు ఆకారపు భాస్కర్ రెడ్డి, కర్ర రాజశేఖర్, గడ్డం విలాస్ రెడ్డి, సమద్ నవాబ్, దండి రవీందర్, గంట శ్రీనివాస్, మేకల నర్సయ్య ముక్క భాస్కర్, బొబ్బిలి విక్టర్, కుర్ర పోచయ్య, ఆస్తపురం రమేష్, షభానా మహమ్మద్, జిడి రమేష్, జ్యోతిరెడ్డి, నెల్లి నరేష్, ఊరడి లత, రజితా రెడ్డి, మహాలక్ష్మి, సలీమొద్దిన్, కీర్తి కుమార్, జూపాక సుదర్శన్, అనిల్ కుమార్, వాడి వెంకట్ రెడ్డి, ఉప్పరి అజయ్, మాసుం ఖాన్, బషీర్ మహమ్మద్ భారీ, నదీం, ఖలీల్, జమీల్, లక్ష్మణ్, రాజ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.