15-03-2025 06:46:18 PM
బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లి పట్టణంలోని రామా టాకీస్ చౌరస్తాలో శనివారం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మను పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ముచ్చర్ల మల్లయ్య ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు దహనం చేశారు. నిరుద్యోగుల పాలిట యమకింకరుడు గా మారిన కేసీఆర్ అరాచక రాజకీయాలకు తెరలేపుతున్నందునే అతని దిష్టిబొమ్మను దహనం చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు. వేసవి కాల అసెంబ్లీ సమావేశాల్లో దళిత నాయకుడు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పై ఇష్టానుసారంగా వాక్యాలు చేసిన బిఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డిని శాశ్వతంగా అసెంబ్లీ సభ్యత్వం రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ మత్తమారి సూరిబాబు, అర్బన్ బ్యాంక్ మాజీ చైర్మన్ డికె రాజలింగు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎంఏ.నయీం భాయ్, జిల్లా జనరల్ సెక్రటరీ గెల్లి జయరాం యాదవ్, సిలివేరి సత్యనారాయణ, ఫ్లోర్ లీడర్ కటకం సతీష్, మాజీ యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ నాయకులు ఎనగందుల వెంకటేష్, సీనియర్ నాయకులు మంగ మూర్తి, మైనార్టీ పట్టణ అధ్యక్షులు ఎండి గౌస్, మాజీ పట్టణ అధ్యక్షులు భూపెల్లి రాజేశ్వర్, మండల నాయకులు బాగా మల్లేష్, మాజీ కౌన్సిలర్లు బైరి శ్రీనివాస్, అల్లం మధు, బి .రాజేశ్వర్, మోగురం కన్నయ్య, కాంగ్రెస్ నాయకులు బర్రె మధునయ్య, రాస భత్తుల వెంకటి, మత్తమారి శ్రీనివాస్, అన్వర్ బాయ్, ఉదయ్ సింగ్, లక్ష్మణ్ సింగ్, రాఘవరెడ్డి, గంధం రమేష్, జావీద్ భాయ్, చిన్న స్వామి, జాన్ సుందర్, పోతరాజుల శ్రీనివాస్, టి. లక్ష్మణ చారి, గోవర్ధన్, గజ్జల కృష్ణమోహన్, మనోహర్, బాబర్ ఖాన్, వాజీద్ భాయ్, బండి శ్రీనివాస్, తాడిశెట్టి శ్రీనివాస్, దేవసాని ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.