calender_icon.png 19 April, 2025 | 11:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంత్యక్రియలో పాల్గొన్న కాంగ్రెస్ నేతలు

07-04-2025 12:57:45 AM

కాటారం, ఏప్రిల్ 6 (విజయక్రాంతి) :   జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలో ఆదివారం కాంగ్రెస్ పార్టీ నాయకులు పాడే మోసి పలువురి మన్ననలు పొందారు. రోజువారి కూలీ పని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్న బోళ్ల వెంకటమ్మ భర్త ఉప్పలయ్య మరణించడంతో వారి కుటుంబాన్ని పరామర్శించారు.

కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ కుటుంబానికి అండగా ఉంటామని భరోసా కల్పించారు. అనంతరం పాడే మోసి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కాటారం మాజీ ఎంపీపీ పంతకాని సమ్మయ్య, మాజీ ఉపసర్పంచ్ నాయిని శ్రీనివాస్ ముదిరాజ్, నాయకులు చీమల రాజు, బీరెల్లి మహేష్, గంట దేవదాస్ తదితరులు ఉన్నారు.