calender_icon.png 11 January, 2025 | 6:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ నాయకుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం

11-01-2025 04:57:23 PM

హైదరాబాద్: మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు(Thanneeru Harish Rao ) మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. యాదాద్రి భువనగిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై కాంగ్రెస్ నాయకుల దాడిని తీవ్రంగా ఖండించారు. మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి, బీఆర్ఎస్ జిల్లా పార్టీ అధ్యక్షులు కంచర్ల రామకృష్ణా రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ప్రశ్నించినందుకు సమాధానం చెప్పలేక దాడులు చేయించడం దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు. ప్రజాస్వామ్యంలో విమర్శలు, ప్రతివిమర్శలు సహజం అన్న హరీశ్ రావు కాంగ్రెస్(Congress ) వచ్చాక దాడుల విష సంస్కృతిని ప్రోత్సహిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. యదా రాజ తథా ప్రజా అన్నట్లుంది కాంగ్రెస్ పార్టీ తీరు ఉందని మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) మాటలతో దాడులు చేస్తే, ఆ పార్టీకి చెందిన నాయకులు భౌతిక దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు.

ఇదేనా మీ సోకాల్డ్ ఇందిరమ్మ రాజ్యం?, ఇదేనా మీ సోకాల్డ్ ప్రజా పాలన?, పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఇలాగే దాడులు జరిగి ఉంటే మీకు అడ్డగోలుగా మాట్లాడే పరిస్థితులు ఉండేవా? బీఆర్ఎస్ పార్టీపైన గోబెల్స్ ప్రచారం చేసే అవకాశం ఉండేదా? అని హరీశ్ రావు ప్రశ్నించారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో, ఏడాది కాంగ్రెస్ పాలనలో అశాంతి, అలజడి నెలకొన్నదన్నారు. బీఆర్ఎస్ పార్టీ(BRS party) కార్యాలయంపై దాడి చేసిన వారిని గుర్తించి, తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇలాంటి దాడులు పునరావృతమవుతే చూస్తూ ఊరుకునేది లేదు. తగిన రీతిలో బుద్ధి చెబుతామని హెచ్చరించారు.