calender_icon.png 23 October, 2024 | 4:34 AM

కాంగ్రెస్ నేతలది దివాళాకోరు ప్రచారం

23-10-2024 02:49:41 AM

  1. చివరికి సత్యమే గెలుస్తుంది 
  2. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

హైదరాబాద్, అక్టోబర్ 22 (విజయక్రాం తి): బీఆర్‌ఎస్ ప్రభుత్వం అప్పులు చేసి ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్థం చేసిందని కాంగ్రెస్ పాలకులు చేసేవన్నీ దివాళాకోరు ఆరోపణలేనని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. సోమవారం ఒక ప్రకటనలో పేర్కొంటూ ఎకానమీ అండ్ పొలిటికల్ వీక్లీ లో ప్రచురితమైన ఫైనాన్షియల్ మేనేజ్‌మెం ట్, అప్పుల నిర్వహణ, రిసోర్స్ మేనేజ్ మెం ట్ ఇండెక్స్ సూచీలను పరిశీలిస్తే సీఎం, ఆర్థి క మంత్రి, ఆ పార్టీ నేతలు  ఏవిధంగా తప్పు డు ప్రచారం చేస్తున్నారో అర్థమవుతుందన్నారు.

ఆర్థికనిర్వహణలో 2014- నుంచి  2022- వరకు దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో ఉన్న ఇండెక్స్‌ను ఎక్స్‌లో షేర్ చేశారు. అప్పుల నిర్వహణ ఇండెక్స్, రిసోర్సె స్ మేనేజ్‌మెంట్ ఇండెక్స్‌లోనూ తెలంగాణ దేశంలోనే రెండో స్థానంలో ఉందన్నారు. కేసీఆర్ ప్రభుత్వం అద్భుతమైన ఆర్థిక నిర్వ హణతో పాటు అప్పుల విషయంలో ఎంత క్రమశిక్షణగా వ్యవహరించిందో ఈ ఇండెక్స్ గణంకాలే  సాక్ష్యమని చెప్పారు.

కేసీఆర్‌పై ఉద్దేశ్య పూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ర్టం ఆర్థికంగా పరిపుష్టంగా ఉందని, దివాళా తీసిందల్లా కాంగ్రెస్ నాయకత్వం, వారి బుర్రలేనని మం డిపడ్డారు. ఆర్బీఐ నివేదికలు, కాగ్ గణాంకాలు, పీఎం ఆర్థిక మండలి రిపోర్టులు, ఆర్థి కవేత్తల విశ్లేషణలు కూడా  తెలంగాణ ఆర్థిక సౌష్టవం నిరూపిస్తున్నప్పటికీ తప్పుడు ప్రచారాలు చేయటం శోచనీయమన్నారు.

ఇన్ని సత్యాలు కళ్లముందు కనిపిస్తు న్నా తప్పుడు ప్రచారాలు చేశారని మండిపడ్డారు.  సొంత ఆదాయం సమకూర్చుకోవడంలో తెలంగా ణ ఎప్పుడూ దేశంలోనే అగ్రస్థానంలోనే ఉం దని, ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితిని దాటకుండా ఆర్థిక క్రమశిక్షణ పాటించామన్నారు. కేసీఆర్ పాలనలో రాష్ర్టం తిరుగులేని ఆర్థిక శక్తిగా అ వతరించి దేశాన్ని పోషించే ఐదారు రాష్ట్రా ల్లో తెలంగాణ ఒకటిగా నిలిచిందన్నారు.  

ఆరోపణలు చేస్తే వదిలే ప్రసక్తి లేదు

ఎలాంటి ఆధారాలు లేకుండా తనపై ఆరోపణలు చేస్తున్న వారిని వదిలి పెట్టే ప్రసక్తిలేదని కేటీఆర్ హెచ్చరించారు. ఇక నుంచి మీడియా, సోషల్ మీడియాలో చేసే నీచమై న ప్రచారాన్ని వదిలిపెట్టేది లేదన్నారు. ఇతరులపై వ్యక్తిగత ఆరోపణలు, నీచమైన వ్యాఖ్యలు తాను ఏనాడు చేయలేదన్నారు. ఆధారాలు లేకుండా నీచమైన వ్యాఖ్యలు చేసే వారికి కొండా సురేఖపై వేసిన రూ. 100 కోట్ల పరువు నష్టం దావా ఒక గుణపా ఠం కావాలన్నారు. న్యాయస్థానాల్లో సత్యం గెలుస్తుందనే నమ్మకం ఉందన్నారు. 

ఐటీ టవర్‌పై నిర్లక్ష్యం బాధాకరం..

మలక్ పేట్‌లో ఐటీ పార్క్ టవర్ పనులు ముందుకు కదలకపోవటం బాధాకరమని బీఆర్‌ఎస్ నేత కేటీఆర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఐటీ టవర్ పనులను పట్టించుకోకపోవటం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. దాదాపు  50 వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఐటీ పార్క్ లక్ష్యమన్నారు. 

 కాంగ్రెస్ ప్రభు త్వం ఈ ఐటీ పార్క్ ను  పూర్తి చేసే విషయం లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని అన్ని ప్రాంతాల్లో ఐటీని విస్తరించాలని ఐటీ మంత్రి శ్రీధర్ బాబును  ఆయన కోరారు. 

కాంగ్రెస్ లీడర్ల ఆదాయం పెరుగుతోంది..

రాష్ట్రం ఆదాయం తగ్గి, కాంగ్రెస్ నా యకుల ఆదాయం అమాంతం పెరుగుతోందని కేటీఆర్ విమర్శించారు. మంగ ళవారం ఎక్స్‌వేదికగా స్పందిస్తూ  ఆదాయంపై తగ్గడంపై అధ్యయనం చేయాల ని ఆదేశించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఇందుకోసం  ఇతర రాష్ట్రాలకు బృందాలు పంపించడం ఈ పాలకుల అజ్ఞానానికి సజీవ సాక్ష్యమన్నారు.

సీఎం రేవంత్ అనాలోచిత విధానాలతో ఆర్థిక వృద్ధి పాతాళానికి పడిపోయిందని మండిపడ్డారు. ఇళ్ల కూల్చివేతల మనస్తత్వంతో రియల్ ఎస్టేట్ కుదేలైందన్నారు. అందిన కాడికి దోచుకో, బావమరిది, తమ్ముళ్లతో తోటలో దాచుకో అనే దోపి డీ విధానాలతో ఆర్థిక వృద్ధికి బీటలు పడ్డాయన్నారు.  సీఎం సొంత రాబడి కే పెద్దపీట వేశారని విమర్శించారు.