calender_icon.png 21 March, 2025 | 5:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బిల్లుల ఆమోదం పట్ల కాంగ్రెస్ నేతల పాలాభిషేకం

20-03-2025 05:10:41 PM

కాటారం (విజయక్రాంతి): అసెంబ్లీలో రాజీవ్ యువ వికాసం, బీసీ రిజర్వేషన్ల బిల్లు, ఎస్సీ వర్గీకరణ బిల్లులు ఆమోదించిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పాలాభిషేకం కార్యక్రమం నిర్వహించింది. గురువారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వేమునూరి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నేతలు రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ మంత్రి శ్రీధర్ బాబు చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు.

పేద, బడుగు బలహీన వర్గాల సంక్షేమం, అభివృద్ధికి బడ్జెట్ లో పెద్దపీట వేశారని ప్రభాకర్ రెడ్డి అన్నారు. చారిత్రాత్మకమైన బిల్లులను ప్రవేశపెట్టి తెలంగాణ అసెంబ్లీ ఘనతను సాధించిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు, మాజీ ఎంపీటీసీ జాడి మహేశ్వరి, ఓబీసీ మండల అధ్యక్షులు కొట్టే ప్రభాకర్, యువజన కాంగ్రెస్ పార్టీ నాయకులు కర్క ఉమాశంకర్, ఓం సింగ్, దోమల సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.