calender_icon.png 30 October, 2024 | 2:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీఆర్ఎస్ సవాలును స్వీకరించిన కాంగ్రెస్ నేతలు

30-10-2024 12:26:45 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): జన్వాడ ఫాంహౌస్ ఘటనపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి చేసిన సవాల్ ను కాంగ్రెస్ నేతలు స్వీకరించారు. హైదర్ గూడ అపోలో ఆసుపత్రికి రాజ్యసబ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఎమ్యెల్సీ బలమురి వెంకట్ తమ రక్త నమూనాలను ఇచ్చేందుకు వారు ఆసుపత్రి వెళ్లారు. మంగళవారం కౌశిక్ రెడ్డి చేసిన సవాలును స్వీకరించి ఏజీ ఆసుపత్రికి వచ్చి వారు దాదాపు రెండు గంటల పాటు బీఆర్ఎస్ నేతలు వస్తారని ఎదురు చూశారు.

బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్, కేటీఆర్ లని కూడా తీసుకోస్తా అని చెప్పిన కౌశిక్ రెడ్డి మాటమీద నిలబడలేదని విమర్శించారు. హైదరాబాదులో ఒక సామెత ఉంది అరే వీడు సలీం ఫేక్ లాగా అన్ని ఫేకుతుంటాడు అని.. బీఆర్ఎస్ లో సలీం ఫేకు లాగా కౌశిక్ రెడ్డి ఉన్నాడు అని ఎద్దేవా చేశారు. కౌశిక్ రెడ్డి నీ బతుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని విమర్శించే అంత సీను ఉందా..? అని ప్రశ్నించారు.