calender_icon.png 18 April, 2025 | 10:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సన్న బియ్యం పథకం పేదవాడి ఆత్మగౌరవ పథకం

11-04-2025 08:01:57 PM

కాంగ్రెస్ పార్టీ నాయకులు వెల్లుట్ల సంతోష్ కుమార్

ఎల్లారెడ్డి,(విజయక్రాంతి): దేశంలో ఎక్కడలేని విధంగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ పథకం ప్రవేశపెట్టిందని కాంగ్రెస్ నాయకులు వెల్లుట్ల సంతోష్ కుమార్ తెలిపారు. శుక్రవారం సంతోష్ విజయక్రాంతి ప్రతినిధితో మాట్లాడుతూ... సన్న బియ్యం పథకం పేదవాడి ఆత్మగౌరవ పథకమని కాంగ్రెస్ పార్టీ నాయకులు వెల్లుట్ల సంతోష్ కుమార్ అన్నారు. ఉచిత సన్న బియ్యం పేదలకు అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దక్కుతుందన్నారు.

వినూత్న ఆలోచనతో సన్న బియ్యం పథకాన్ని అమలు చేసి పేద ప్రజల మనసు దోచుకున్నారని వెల్లడించారు. సన్న బియ్యం పంపిణీ తో 80% శాతానికి పైగా బడుగు బలహీన వర్గాల ప్రజలు ప్రయోజనం పొందుతున్నారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి, స్థానిక ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావుకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సన్న బియ్యం పంపిణీ పథకం విప్లవాత్మకం పథకం అని తెలిపారు. దేశ చరిత్రలోనే తెలంగాణ రాష్ట్రంలో సన్న బియ్యం పంపిణీ పథకం ఒక చారిత్రాత్మకమని ఆయన కొనియాడారు.