calender_icon.png 9 October, 2024 | 3:48 PM

కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరిన మైనార్టీ నేత

09-10-2024 01:51:57 PM

హైదరాబాద్: మూసీ నిధుల్లో రూ. లక్ష కోట్లు కాజేయాలనేది కాంగ్రెస్ కుట్ర చేస్తోందని, కాజేసిన నిధుల్లో రాహుల్, ఇతర నేతలు పంచుకోవాలని ప్లాన్ చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. బుధవారం శేరిలింగంపల్లికి చెందిన మైనార్టీ నేత అలా ఉద్దీన్ కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. ఆయనకు కండువా కప్పి కేటీఆర్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ... రైతులు, యువతను కాంగ్రెస్ ప్రభుత్వం మోసగించిందని కేటీఆర్ ఆరోపించారు.

మహాలక్ష్మి పథకం కింద మహిళల ఖాతాల్లో ప్రతినెలా రూ. 2500 జమ చేస్తామన్నారు. వృద్ధులకు రూ. 4 వేల పింఛన్ ఇస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు 420 వాగ్దానాలు చేసింది. రైతుబంధు, పథకాలు అమలుకు ప్రభుత్వం వద్ద డబ్బుల్లేవని విమర్శించారు. మూసీకి మాత్రం రూ. 1.5 లక్షల కోట్లు ఖర్చు చేస్తామన్నారు. రైతు బంధు, తులం బంగారం ఇస్తే కమీషన్లు రావని వారికి తెలుసన్నారు. హామీలపై ప్రజలు కాంగ్రెస్ ను నిలదీయాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో పండగ వాతావరణం లేదని చెప్పిన కేటీఆర్ కాంగ్రెస్ నేతల మోసం హర్యానా వాళ్లకు తెలిసిందన్నారు. అందుకే హర్యానాలో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ది చెప్పారని కేటీఆర్ వ్యాఖ్యనించారు.