04-04-2025 12:04:21 AM
జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్ రావు
కామారెడ్డి, ఏప్రిల్ 3 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా కేంద్రంలో రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర 3 వ వార్డు లో డిసిసి అధ్యక్షులు కైలా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. అనంతరం కామారెడ్డి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గూడెం శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో కామారెడ్డి మండలం షాబ్దీపూర్, క్యాసంపల్లి,ఇస్రోజివాడి, గ్రామాల్లో జై బాపు. జై భీమ్. జై సంవిధాన్ అభియాన్. కార్యక్రమాన్ని ప్రతిజ్ఞ బూని వార్డు లో ఈంటింటికి తిరుగుతూ ప్రజలకు వివరిస్తూ పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కైలా శ్రీనివాసరావు, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గూడెం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా పార్లమెంటులో అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను కాంగ్రెస్ పార్టీ దేశ వ్యాప్తంగా జై బాపు జై భీమ్. జై సంవిధాన్ . అనే కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రారంభించింద అని అన్నారు.
పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పండ్ల రాజు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గోనె శ్రీనివాస్, జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి కారంగుల అశోక్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ లక్ష్మి రాజా గౌడ్ . మాజీ జెడ్పిటిసి నిమ్మ మోహన్ రెడ్డి.మైనార్టీ సెల్ కన్వీనర్ సిరాజ్ ఉద్దీన్, భూమాని బాలరాజ్. కొలిమి భీమ్ రెడ్డి. వార్డు మాజీ కౌన్సిలర్ లు పోదర్ల రాజు, పిడుగు మమత సాయిబాబు, కోయల్కర్ కన్నయ్య, తెజాపు ప్రసాద్, పీప్పిరి చందు, సాయిలు,కిరణ్, సత్యం, జాకీర్, జావిద్, సన్ని మహిళలు పాల్గొన్నారు.