calender_icon.png 26 March, 2025 | 8:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వర్గీకరణపై మాట నిలబెట్టుకున్న కాంగ్రెస్

24-03-2025 01:42:06 AM

  1. పీసీసీ ప్రధాన కార్యదర్శి కొండేటి మల్లయ్య
  2. ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో కొండేటికి సన్మానం

నల్లగొండ, మార్చి 23 (విజయక్రాంతి): ఎస్సీ వర్గీకరణపై కాంగ్రెస్ ఇచ్చిన మాట నిలబెట్టుకుందని పీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొండేటి మల్లయ్య అన్నారు. ఎస్సీ వర్గీకరణ పోరాటంలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో మాదిగ ఉద్యోగ సమాఖ్య (ఎంఈఎఫ్) అధ్యక్షుడిగా కొనసాగి, ఎమ్మార్పీఎస్, ఎంఈఎఫ్ ఉద్యమాన్ని ముందుకు నడిపించడంలో కీలకపాత్ర పోషించిన కొండేటి మల్లయ్యను ఆదివారం నల్గొండలోని ఆయన నివాసంలో ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్రంలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ వేసి, కమిషన్ రిపోర్ట్ ఆధారంగా అసెంబ్లీలో బిల్లు ఆమోదించి కేంద్రానికి పంపించిందని అన్నారు. దీంతో ఎన్నో దశాబ్దాల మాదిగల కళ నెరవేరిందని పేర్కొన్నారు. 

కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా ఎస్సీ వర్గీకరణ ఉద్యమానికి అండగా నిలిచిందని తెలిపారు. మల్లయ్యను సన్మానించిన వారిలో ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు కత్తుల తులసిదాస్, మేడి చిన్న, తొలకొప్పుల గిరి,కత్తుల పూర్ణనందం,కత్తుల సైదులు, వట్టేపు అంజయ్య, కత్తుల రమేష్ ఉన్నారు.