calender_icon.png 21 April, 2025 | 6:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్‌తోనే అంబేద్కర్‌కు అవమానం

14-04-2025 12:44:08 AM

ఖమ్మం, ఏప్రిల్ 13 (విజయక్రాంతి): -బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రచించిన  భారత రాజ్యాంగమే బిజెపి ప్రధాన ఎజెండా అని, ఆయన ఆశయ సాధనకు కృషి చేసే ఏకైక పార్టీ కమలం పార్టీ అని ఆ పార్టీ జాతీయ నాయకులు, మాజీ శాసన మండలి సభ్యులు  పొంగులేటి సుధాకర్ రెడ్డి పేర్కొన్నారు.

అంబేద్కర్ జయంతి ఉత్సవాల సందర్భంగా ఖమ్మం నగరంలోని జడ్పీ సెంటర్లో గల అంబేద్కర్ విగ్రహం వద్ద జరిగిన విలేకరుల సమావేశంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావుతో కలిసి పొంగులేటి సుధాకర్ రెడ్డి మాట్లాడారు. భారత రాజ్యాంగాన్ని పకడ్బందీగా అమలు చేసేది కేవలం బిజెపి ప్రభుత్వం మాత్రమేనని, గత కాంగ్రెస్ పాలనలో అంబేద్కర్ కు అవమానాలను మాత్రమే మిగిలిచ్చిందని విమర్శించారు.

కనీసం పార్లమెంట్ ప్రాంగణంలో అంబేద్కర్ చిత్రపటాన్ని కూడా పెట్టకుండా బడుగు బలహీన వర్గాల పట్ల తమ వైఖరిని తేటతెల్లం చేసిందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలకు మొగ్గు చూపుతున్న ప్రజలు బిజెపికి బ్రహ్మరథం పడుతున్నారని హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి పార్లమెంటరీ కోఆర్డినేటర్ నంబూరి రామలింగేశ్వర రావు, గోంగూర వెంకటేశ్వర్లు, సన్నె ఉదయ్ ప్రతాప్, దేవకీ వాసుదేవరావు, ఈవీ రమేష్, నున్నా రవికుమార్, దొంగల సత్యనారాయణ, కోటమర్తి సుదర్శన్, నల్లగట్టు ప్రవీణ్ కుమార్, నీరుకొండ ఉషారాణి, రేఖా సత్యనారాయణ, మాడుగుల చిన్నికృష్ణ పాల్గొన్నారు.

 తృటిలో తప్పిన ప్రమాదం : బిజెపి తమిళనాడు, కర్ణాటక రాష్ట్రల ఇంచార్జి పొంగులేటి సుధాకర్‌రెడ్డి ఖమ్మంలో అంబేద్కర్ విగ్రహాన్ని నీటితో కడిగి శుభ్రం చేశారు. చీపురుతో ఊడుస్తుండగా సుధాకర్‌రెడ్డితో పాటు పార్టీ జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు కాలుజారి మెట్లపై పడ్డారు. కార్యకర్తల అప్రమత్తంతో స్వల్ప గాయాలతో బయటపడ్డారు.