* కేంద్రమంత్రి జీ కిషన్‌రెడ్డి
హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 17 (విజయక్రాంతి): భారత రాజ్యాంగాన్ని అనేక రకాలుగా అవమానించి, రాజకీయా అవసరాలకు అనుకూలంగా మార్పులు చేసుకున్న చరిత్ర కాంగ్రెస్ పార్టీదేనని, రాజ్యాంగం విషయంలో ఆ పార్టీ తీరు చూస్తుంటే దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టుగా ఉందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జీ కిషన్‌రెడ్డి విమర్శించారు.
హైదరాబాద్ బర్కత్‌పురాలోని బీజేపీ సిటీ ఆఫీస్‌లో శుక్రవారం నిర్వహించిన సంవిధాన్ గౌరవ్ అభియాన్ వర్క్‌షాప్ కార్యక్రమానికి కిషన్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. ప్రధాని పదవిని కాపాడుకోవడం కోసం ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకే ఉందన్నారు. జనవరి 26న గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని భారత రాజ్యాంగ ఉత్సవాలను తమ ప్రభుత్వమే నిర్వహిస్తోందని చెప్పారు.