calender_icon.png 6 November, 2024 | 1:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

24 గంటల కరెంటుపై కాంగ్రెస్‌ది తప్పుదోవ

05-11-2024 01:40:56 AM

ఎక్స్ వేదికగా మాజీ మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం

హైదరాబాద్, నవంబర్ 4 (విజయక్రాంతి): 24 గంటల విద్యుత్ విషయంలో కాంగ్రెస్ పార్టీ దేశాన్ని తప్పుదోవ పట్టిస్తోందని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. నవ్విపోదురుగాక, నాకేంది సిగ్గు అన్నట్లుగా కాంగ్రెస్ పార్టీ తీరుందని ఎక్స్ వేదికగా ఆయన విమర్శించారు.

దేశంలో రైతులకు 24 గంటల ఉచిత కరెంటును అందించిన ఏకైక రాష్ట్రంగా తెలంగాణను నిలిపింది బీఆర్‌ఎస్ పార్టీయేనని, కానీ ఆ ఘనత కూడా తమదేనంటూ ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో సీఎం రేవంత్‌రెడ్డి ప్రచారం చేసుకోవడం సిగ్గు చేటన్నారు. గతంలో రైతులకు ౨౪ గంటల ఉచిత కరెంట్ దండగని, మూడు గంటల విద్యుత్ సరిపోతుందని రైతు వ్యతికేక వైఖరిని ప్రకటించిన చరిత్ర సీఎం రేవంత్ రెడ్డిదని అన్నారు.

ఇప్పుడేమో ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో ఓట్ల కోసం కేసీఆర్ అందించిన ౨౪ గంటల కరెంట్ ఘనతను తమ ఖాతాలో వేసుకుంటున్నార ని మండిపడ్డా రు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో సాధించిన అభివృద్ధిని చూపించుకునే ముఖంలేక,  బీఆర్‌ఎస్ పార్టీ సాధించిన అభివృద్ధిని చూపించి ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.