పార్టీ చేవెళ్ల నియోజకవర్గ ఇంచార్జి భీమ్ భరత్
చేవెళ్ల, ఫిబ్రవరి 5:ఎస్సీ వర్గీకరణను సాధ్యం చేయడంతో పాటు బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయబోతున్న ఏకైక పార్టీ కాంగ్రెస్సేనని కాంగ్రెస్ చేవెళ్ల నియోజకవర్గ ఇంచార్జి పామెన భీమ్ భరత్ స్పష్టం చేశారు. బుధవారం మొయినాబాద్ మండలం అజీజ్ నగర్లో టీయూఎఫ్‌ఐడీసీ కార్పొరేషన్ చైర్మన్ చల్ల నరసింహ రెడ్డి,
ఇతర నేతలతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించి సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం రెండు చారిత్రక నిర్ణయాలు తీసుకొని రాష్ట్రాన్ని దేశానికే ఆదర్శంగా నిలిపారని కొనియాడారు.
ఈ విషయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక పాత్ర పోషించారని ప్రశంసించారు. ఇందుకు సంపూర్ణంగా సహకరించి ప్రోత్సహించిన ఏఐసీసీ నేత రాహుల్ గాంధీతో పాటు జాతీయ నాయకత్వానికి తెలంగాణ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ బొర్రా జ్ఞానేశ్వర్, రాష్ట్ర అధికార ప్రతినిధి గౌరి సతీష్, సర్దార్ నగర్ మార్కెట్ కమిటీ చైర్మన్ సురేందర్ రెడ్డి , మొయినాబాద్ మండల అధ్యక్షుడు మాణయ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.