- బీజేపీ శాసనసభ పక్ష నేత మహేశ్వర్‌రెడ్డి
- సుంకిశాలను సందర్శించిన బీజేపీ ఎమ్మెల్యేలు
నల్లగొండ, ఆగస్టు 13 (విజయక్రాంతి): రాష్ట్రంలో కాంగ్రెస్‌ది కమీషన్ల ప్రభుత్వమని నిర్మల్ ఎమ్మెల్యే, బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. పెద్దవూర మండలంలోని సుంకిశాల ప్రాజెక్టులో రిటెయినింగ్ వాల్ కూలిన ప్రాంతాన్ని మం గళవారం బీజేపీ ఎమ్మెల్యేలు మహేశ్వర్‌రెడ్డి, రామారావు పటేల్, పాల్వాయి హరీశ్ బాబు, ఎమ్మెల్సీ ఏవీఎన్‌రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా మహేశ్వర్‌రెడ్డి మాట్లాడు తూ.. ఆగస్టు 2న రిటెయినింగ్ వాల్ కూలితే మీడియాలో వచ్చేంత వరకు విషయాన్ని ఎందుకు గోప్యంగా ఉంచిందని ప్రశ్నించారు.
గుత్తేదారును కాపాడేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆక్షేపించారు. విపక్షం లో ఉన్నప్పుడు మేఘా కంపెనీపై దుమ్మెత్తి పోసిన రేవంత్‌రెడ్డి అదే సంస్థకు ఇప్పుడు కాంట్రాక్టులు ఎందుకు కట్టుబెడుతున్నారని ప్రశ్నించారు. ఎలాంటి నివేదిక రాకుండా మంత్రులు ఉత్తమ్‌కుమార్, తుమ్మ ల నాగేశ్వర్‌రావు జరిగిన నష్టం చిన్నదని, కాంట్రాక్టు సంస్థే ఆ నష్టాన్ని భరిస్తుందని ఎలా చెబుతారని ప్రశ్నించారు. మేఘా సంస్థను బ్లాక్ లిస్టులో పెట్టాలని ముథోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ కోరారు.