calender_icon.png 29 November, 2024 | 2:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హర్యానాలో కాంగ్రెస్‌ను విశ్వసించలేదు

09-10-2024 02:28:03 AM

మాజీ మంత్రి హరీశ్‌రావు 

హైదరాబాద్, అక్టోబర్ 8 (విజయక్రాంతి): కాంగ్రెస్ గ్యారెంటీల గారడీని హర్యానా ప్రజలు విశ్వసించకపోవడంతో ఘోర ఓటమి చవిచూసిందని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. ఎన్నికల ఫలితాలపై మంగళవారం ఎక్స్ వేదికగా ఆయన స్పందిస్తూ.. తెలంగాణ, కర్ణాటకలో కాంగ్రెస్ చేసిన మోసాలను హర్యానా ప్రజలు గమనించారని, ఆ ప్రభావం ఎన్నికల ఫలితాల్లో స్పష్టంగా కనబడిందన్నారు.

ఈ ఫలితాలు చూసిన సీఎం రేవంత్ రెడ్డి ప్రతీకార రాజకీయాలు, దృష్టి మళ్లింపు రాజకీయాలు మా నుకొని, ౬ గ్యారెంటీలను, 420 హామీలను అమలు చేయాలని సూచించా రు. కాశ్మీర్‌లో బీజేపీని, హర్యానాలో కాంగ్రెస్‌ను ప్రజలు విశ్వసించలేదన్నారు. రెండు జాతీయ పార్టీల పట్ల ప్రజల్లో విముఖత బయటపడిందన్నారు.