calender_icon.png 22 December, 2024 | 3:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హమీల అమలులో కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి లేదు

07-08-2024 01:08:07 AM

నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి

నిర్మల్, ఆగస్టు 6 (విజయక్రాంతి): హామీల అమలులో కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి లేదని నిర్మల్ ఎమ్మెల్యే, బీజేఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి విమర్శించారు. మంగళవారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో నిర్మల్ నియోజకవర్గంలోని 50మంది లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను, ఎల్వోసీ పత్రాలను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. రేవంత్‌రెడ్డి పాలనలో ప్రజల కు ఒరిగింది ఏమీ లేదన్నారు. అర్హులైన రైతులకు రుణమాఫీ కావడం లేదన్నారు. షర తులు లేకుండా రైతులందరికీ రుణమాఫీ అందించాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీలో బడ్జెట్ అంకెల గారడీగా చూపించారని విమర్శించారు. ప్రజలకు ప్రభుత్వం ఇచ్చిన హమీ లు అమలు అయ్యేదాక బీజేపీ ప్రజలతో కలిసి పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు.