- శ్రీతేజ్ కోసం మృత్యుంజయ యాగం చేయండి
- సహకారం అందిస్తాం
- పీసీసీ మాజీ అధ్యక్షుడు వీ హనుమంతరావు
హైదరాబాద్, డిసెంబర్ 23 (విజయక్రాంతి): కాంగ్రెస్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడే పార్టీ కాదని పీసీసీ మాజీ అధ్యక్షడు వీ హనుమంతరావు అన్నారు. సినీ ఇండస్ట్రీకి తమ ప్రభుత్వం వ్యతిరేకం కాదని.. అందుకే పుష్ప సినిమా టికెట్ ధరల పెంపునకు సీఎం రేవంత్‌రెడ్డి అనుమతి ఇచ్చినట్టు గుర్తు చేశారు.
సోమవారం ఆయన గాంధీభవన్‌లో మాట్లాడుతూ.. అల్లు అరవింద్ ఇంటిపై దాడిని సీఎం కూడా ఖండించారని, దీన్ని మిగతా పార్టీలు రాజకీయం చేయడం మానుకోవాలన్నా రు. బెయిల్‌పై వచ్చి న అల్లు అర్జున్ మీడియా సమావే శం ఎందుకు పెట్టా ల్సి వచ్చిందన్నారు. సీఎం మాటలకు మీ మనోభావాలు దెబ్బతింటే.. బాధిత కుటుంబానికి మనోభావాలు లేవా? అని ప్రశ్నించారు.
కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మణిపూర్ ఘటనపై ఎందుకు మాట్లా డటం లేదని ప్రశ్నించారు. సంధ్య థియేటర్ ఘటనతో రాజకీయంగా లబ్ధి పొందాలని బీఆర్‌ఎస్, బీజేపీ చూస్తున్నాయని విమర్శించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ త్వరగా కోలుకోవడానికి మృత్యుంజయ యాగం చేయాలని, అందుకు ఆ కుటుంబానికి తగిన సహాయం చేస్తానని వీహెచ్ హామీ ఇచ్చారు.