calender_icon.png 9 January, 2025 | 1:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్‌ది దాడుల సంస్కృతి కాదు

08-01-2025 01:48:54 AM

  • పార్టీల కార్యాలయాలపై దాడిని ఖండిస్తున్నా..

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క 

 ఖమ్మం, జనవరి7 (విజయక్రాంతి): దాడులు చేసే సంస్కృతి కాంగ్రెస్ పార్టీది కాదని,  అయినా రాజకీయ పార్టీల కార్యాలయాలపై దాడులు చేయడం సమర్థనీయం కాదని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. గాంధీభవన్, బీజేపీ కార్యాలయాలపై జరిగిన  దాడులను  తన తో పాటు  టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్,  ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కూడా ఖండించారన్నారు.

మంగళవారం ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండల పర్యటనలో ఆయన మాట్లాడారు.. కొంతమంది బీజేపీ నాయకులు దాడి గురించి  వాస్తవాలు  తెలుసుకోకుండా  మాట్లాడుతున్నార ని, ముందుగా వారి పార్టీ  నాయకులకే బుద్ధి చెప్పాలని హితువు పలికారు.  ఎంపీ ప్రియాంక గాంధీపై బీజేపీ నేత రమేశ్ బిదూ రి చేసిన అనుచిత వ్యాఖ్యలపై బీజేపీ కేంద్ర నాయకత్వం దేశానికి క్షమాపణ చెప్పాలని డిమాం డ్ చేశారు.

వెంటనే అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పటిష్టంగా  అమలు చేస్తామని,  ఎవరు ఎవరిపై దాడులు  చేసినా చట్టం  తన పని తాను చేసుకుపోతుందన్నారు. సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్,  పార్టీ ఎర్రుపాలెం మండల అధ్యక్షుడు వేమిరెడ్డి సుధాకర్‌రెడ్డి  పాల్గొన్నారు. 

కేటీఆర్ వ్యవహారంలో ప్రభుత్వ జోక్యం లేదు.. 

కేటీఆర్ వ్యవహారంలో ప్రభుత్వం జోక్యం ఉండదని, ఆయన కేసును ఏసీబీ, పోలీసులు చూసుకుంటారని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. కేటీఆర్‌ను ఎప్పుడు అరెస్ట్ చేస్తారని ప్రశ్నించగా.. కేసు కోర్టులో ఉన్నందున తానేమి మాట్లాడలేనని చెప్పారు. అది కోర్టు వ్యవహారమని, అందులో రాజకీయ జోక్యం ఉండదన్నారు.