calender_icon.png 14 November, 2024 | 7:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతులను కంటతడి పెట్టిస్తున్న కాంగ్రెస్

14-11-2024 03:09:04 AM

మెదక్ ఎంపీ రఘునందన్‌రావు

హవేలీ ఘణపూర్(మెదక్), నవంబర్ 13: ఎద్దు ఏడ్చిన ఏవుసం.. రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడిన దాఖలాలు లేవని మెదక్ ఎంపీ రఘునందన్‌రావు అన్నారు. బుధవారం ఆయన హవేలీఘణపూర్ మండలం తొగిటలో కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. గతేడాది ఈ కాలంలో మార్కెట్లో సన్నరకం ధాన్యాన్ని రూ.3,200కు కొంటే ఈ ఏడాది రూ.2,300 కూడా కొంటలేరన్నారు. దళారుల ప్రమేయాన్ని తగ్గించాలని ప్రభుత్వాన్ని కోరారు.

పలువురు రైతులు తమ గోడు విన్నవించుకోగా అధికారులతో ఎంపీ ఫోన్ లో మాట్లాడి లారీలను పంపించి ధాన్యం కొనాలని ఆదేశించారు. ఆయనవెంట బీజేపీ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి ఎంఎల్‌ఎన్‌రెడ్డి, నిజాంపేట మాజీ జడ్పీటీసీ పంజా విజయ్‌కుమార్, నందారెడ్డి, ఈర్ల రంజిత్‌రెడ్డి, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ, శ్యామ్, వడ్ల నవీన్‌కుమార్, నాయిని ప్రసాద్ ఉన్నారు.