calender_icon.png 8 April, 2025 | 10:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేదోడి కడుపు నింపుతున్న కాంగ్రెస్

06-04-2025 12:00:00 AM

సీనియర్ నేత మురళీధర్‌రెడ్డి 

హైదరాబాద్, ఏప్రి ల్ 5 (విజయక్రాంతి): తెలంగాణలోని కాం గ్రెస్ ప్రభుత్వం రేషన్ షాపుల ద్వారా సన్నబియ్యం ఇవ్వడంపై కాంగ్రెస్ సీనియర్ నేత కే మురళీధర్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శనివారం ఆయన మాట్లాడుతూ.. దొడ్డు బియ్యం ద్వారా ఇబ్బంది పడుతున్న పేదలకు సన్నబియ్యం ఇవ్వడం గొప్ప విషయమ న్నారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభు త్వం ఏర్పడిన నాటి నుంచి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నదన్నారు. సన్నబియ్యం అందించడం సంతోషకర విషయం అని మురళీధర్‌రెడ్డి కొనియాడారు.