09-02-2025 01:46:07 AM
మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ
హైదరాబాద్, ఫిబ్రవరి 8 (విజయక్రాంతి): -ఢిల్లీలో బీజేపీ గెలుపు చరిత్రాత్మకమని మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ పేర్కొన్నారు. హస్తినలో అభివృద్ధికి బీజం పడిందని, ఇదే స్ఫూర్తితో తెలంగాణలో కూడా గెలుస్తామన్నారు. దేశంలో కాంగ్రెస్ ఖతం అయినట్లే అని అరుణ జోస్యం చెప్పారు. శనివారం ఆమె ఒక ప్రకటనలో ఢిల్లీలో బీజేపీ ఘన విజయం సాధించడంపై హర్షం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్‌ను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. దేశంలో ప్రతిపక్షపార్టీలా అది వ్యవహరించడం లేదన్నారు. కేజ్రీవాల్ చేసిన అవినీతిని ప్రజలు గుర్తించారని, అందుకే ఓటుతో బుద్ధి చెప్పారని వివరించారు. అధికారం ఉందని విర్రవీగితే ఫలితం తెలంగాణలో కాంగ్రెస్‌కు ఢిల్లీలో ఆప్‌కు పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు. ఢిల్లీ గెలుపు ప్రభావం తెలంగాణపై తప్పక ఉంటుందని చెప్పారు.