14-04-2025 12:17:05 AM
ఉర్దూ మీడియంలో ఖాళీ ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తాం
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 13(విజయక్రాంతి) : ఉర్దూ బాషా, సాహిత్యం, సం స్కృతిని కాపాడేందుకు కాంగ్రెస్ పార్టీ, రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. శనివారం న్యూ మల్లెపల్లిలోని అన్వర్-ఉల్- ఊలుమ్ కళాశాలలో ఆ సంస్థ ఎడ్యుకేషనల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన 8 వ నవాబ్ ఆలం ఖాన్ స్మారక ముశైరాలో ఆయన పాల్గొని మాట్లాడుతూ ఉర్దూ బాష ను కాపాడుకోవడానికి ప్రభుత్వం నిబద్ధతతో పని చేస్తుందన్నారు. ఉర్దూ మీడియం లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు. ఉర్దూ భాషకు దక్కాల్సిన గౌరవాన్ని ,గుర్తింపును కాపాడడంలో వెనక్కి తగ్గేది లేదని ఆయన తేల్చిచెప్పారు.
తాను పాత బస్తీలోనే పుట్టానని, తన తల్లిదండ్రులు ఉర్దూ మీడియంలో విద్యను అభ్యసించడమే కాకుండా ఇంట్లో మాట్లాడేది ఉర్దూ భాషలోనే నని ఆయన గుర్తుకు తెచ్చుకున్నారు. ఉర్దూ భాషను ప్రోత్సాహించడానికి ప్రతి సంవత్సరం ముశైరా నిర్వహి స్తున్న అన్వర్ ఉల్ ఉలుమ్ ఎడ్యుకేషనల్ సంస్థ కృషిని ఆయన అభినందించారు. స్వా త్ంరత్రోద్యమంలో ఉర్దూ భాష ముఖ్య భూ మిక పోషిందన్నారు. వివిధ సంస్క్రుతులకు ఉర్దూ బాషా వారధిగా వ్యహారించిందని ఆయన గుర్తు చేశారు.
మైనారిటీల హక్కుల పరిరక్షణకు నిరంతరం కృషి..
మైనారిటీల హక్కుల పరిరక్షణతో పాటు వారి సంక్షేమానికి కాంగ్రెస్ కృషి చేస్తోందన్నారు. మైనారిటీ విద్యా సంస్థలకు చేయుత నివ్వడంతో పాటు మైనార్టీల సంక్షేమానికి కేటాయిస్తున్న బడ్జెట్‌ను రెండింతలు చేశామన్నారు. మైనారిటీలను బలోపేతం చేయడా నికి నాలుగు వేల కోట్లు ఖర్చు చేయబోతున్నట్లు ఆయన ప్రకటించారు. బి.ఆర్.ఎస్ పాలనలో మైనారిటీ కళాశాలలు ఫీజు రీ ఎంబర్స్‌మెంట్ బకాయిలను ఆయన ఉటంకిస్తూనే ఆ సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.
ముస్లిం మైనారిటీల 4 శాతం రిజర్వేషన్లను కాపాడతామని ఇది రాజ్యాంగ హక్కు అని ఆయన చెప్పారు.ఆ రిజర్వేషన్లను కాపాడేందుకు న్యాయస్థానాల్లో పోరాడుతామన్నా రు. . మైనారిటీ హక్కులకు భం గం కలిగించే చట్టాలకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ వ్యతిరేకంగా నిలబడిందన్నారు. ఇటీవల పార్లమెం ట్‌లో ఆమోదం పొందిన వక్ఫ్ సవరణ చట్టాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రం గా అడ్డుకున్న విషయం మైనారిటీలు గుర్తుంచుకోవలన్నా రు. ఢిల్లీ నుంచి మొదలు తెలంగాణా వరకు రాజ్యాంగ విలువల్ని కాపాడడంతో పాటు మైనారిటీల సంక్షేమానికి భద్రతకు కాంగ్రెస్ వెన్నుదన్నుగా నిలుస్తోందన్నారు. రాష్ట్రంలోనీ విద్యాసంస్థలలో ఈ విద్యాసంస్థ మంచి ప్రమాణాలు పాటిస్తుందని, 18000 మందికి విద్యను అందిస్తున్న అన్వర్ ఉల్ ఉలుమ్ సంస్థకు ప్రభుత్వ పరంగా అండగా ఉంటామని ఉత్తమ్ కుమార్‌రెడ్డి తెలిపారు.