calender_icon.png 18 March, 2025 | 7:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

మాదిగలను మోసం చేస్తున్న కాంగ్రెస్

18-03-2025 12:00:00 AM

  • ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలి

మాజీ కార్పొరేటర్, తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షుడు విజయభాస్కర్

హనుమకొండ/భీమదేవరపల్లి, మార్చి 17 (విజయ క్రాంతి): ఎమ్మార్పీఎస్ దీక్షకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్టు మాజీకార్పొరేటర్, తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షు డు దాస్యం విజయభాస్కర్ తెలిపారు. సోమవారం ఏకాశిల పార్క్ వద్ద ఎమ్మా ర్పీఎస్ జిల్లా అధ్యక్షుడు గద్దల సుకుమార్ అధ్యక్షతన ఎమ్మార్పీఎస్, ఎంఎస్పి ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే దీక్షలు తొమ్మిదవ రోజుకు చేరింది.

ఈ దీక్షకు సంఘీభావం తెలిపిన మాజీ కార్పొరేటర్ దాస్యం విజయ భాస్కర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ మొదటి సంవత్సరంలోనే తెలంగాణ అసెంబ్లీలో ఎస్సీల వర్గీకరణకు అనుకూలంగా తీర్మానం చేసి కేంద్రానికి పంపించిన ఏకైక నాయకుడు కేసీఆర్ అని, వర్గీకరణ కోసం కేసీఆర్ అనేక సార్లు ప్రధానమంత్రిని కలిసి విజ్ఞప్తి చేశారని గుర్తు చేశారు.

మంద కృష్ణ మాదిగ నాయకత్వంలో మాదిగలు ఎలాంటి పోరాటం చేసిన బిఆర్‌ఎస్ పార్టీ తరపున సంపూర్ణ మద్దతు ఉంటుందని అవసరమైతే ప్రత్యక్షంగా మాదిగల కోసం పోరాటం చేస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎంఎస్పి జాతీయ నేతలు  మంద కుమార్ మాదిగ , వేల్పుల సూరన్న కాపు, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు జన్ను దినేష్ మాదిగ, ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి జిల్లా ఇన్చార్జి మంద రాజు మాదిగ,మాదిగ యువసేన జాతీయ నాయకులు పుట్ట బిక్షపతి మాదిగ, చాతల్ల శివ మాదిగ ,ఎమ్మార్పీఎస్ సోషల్ మీడియా ఇంచార్జ్ మంద వర్ధన్ మాదిగ,

ఎమ్మార్పీఎస్ మండ ల నాయకులు అడ్డూరి అనిల్ మాదిగ, బొంకురి సాంబయ్య మాదిగ , అడ్డూరి రమేష్ మాదిగ , బొంకూరి ఐలయ్య మాదిగ , చిలుముల రవి మాదిగ , సుంచు అశోక్ మాదిగ , అడ్డూరి బాబు మాదిగ , బొంకురి రాధ మాదిగ , బొంకూరి రజిత మాదిగ , చిలుముల లావణ్య మాదిగ , సుశీల మాదిగ తదితరులు పాల్గొన్నారు.

అన్యాయం చేయాలని చూస్తే ఊరుకోం

ఎస్సీ  వర్గీకరణను అన్ని ఉద్యోగ నోటిఫికేషన్ లకు వర్తింపజేయాలని డిమాండ్ చేస్తూ హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ అంబెడ్కర్ కూడలి వద్ద  జరుగుతున్న రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని అంబేద్కర్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెప్పాలా ప్రకాష్, అంబేద్కర్ సంఘం  రాష్ట్ర కార్యదర్శి కండే సుధాకర్, బీసీ సంఘం నాయకులు వేముల జగదీష్  సందర్శించి సంఘీభావాన్ని తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్గీకరణ అమల్లో లేకపోతే ఉద్యోగాల్లో మాదిగ లకు తీవ్ర అన్యాయం జరుగుతుందనే విష యం రేవంత్ రెడ్డికి తెలిసినప్పటికీ మాదిగ అన్యాయం చేయాలని చూస్తే ఊరుకోమ న్నారు.

కార్యక్రమంలో హుస్నాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి మాట్ల వెంకటస్వామి మాది గ,రాష్ట్ర నాయకులు రేణిగుంట్ల బిక్షపతి, అంబేద్కర్ సంఘ నాయకులు సుధాకర్ ఎమ్మార్పీఎస్ నాయకులు ఆశీర్వాదం, వేల్పుల పాపక్క, వేల్పుల రాధా ఎమ్మార్పీఎస్ నాయకులు పాల్గొన్నారు.

వర్గీకరణ చట్టాన్ని తక్షణమే అమలు చేయాలి

జనగామ, మార్చి 17 (విజయక్రాం తి): ఎస్సీ వర్గీకరణ విషయంలో ప్రస్తు తం నడుస్తున్న అసెంబ్లీ సమావేశాల్లోనే బిల్లుకు చట్టబద్ధత కల్పించనున్న నేపథ్యంలో జస్టిస్ షమీమ్ అక్తర్ కమిషన్ నివేదికలో చేసిన పొరపాట్లను, రిజర్వేషన్ల కేటాయింపులో జరిగిన లోపాలను సరిచేసి ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని తీసుకువచ్చి తక్షణమే అమలు చేయాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాగళ్ల ఉపేందర్ మాదిగ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

జనగామ జిల్లా కేంద్రంలో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన నిరవధిక నిరసన దీక్షలు సోమవారం నాటికి ఎనిమిదో రోజుకు చేరుకు న్నాయి. బీఆర్‌ఎస్ సీనియర్ నాయకు లు మామిడి లాజర్ మాదిగ, తిప్పారపు ఆనంద్  ప్రారంభించారు. అనంతరం జిల్లా ప్రధాన కార్యదర్శి బోట్ల మహేష్ మాదిగ అధ్యక్షత వహించగా ఉపేందర్ మాట్లాడారు.

తెలంగాణలో విడుదల చేస్తున్న వివిధ పరీక్ష ఫలితాలకు కూడా వర్గీకరణ వర్తించేలా మార్గదర్శకాలు విడుదల చేసి ఎస్సీ వర్గీకరణ ప్రకారమే ఉద్యోగ నియామక ప్రక్రియ చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్‌పీ జిల్లా అధ్యక్షులు గద్దల కిషోర్ మాదిగ, ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు పైసా రాజశేఖర్ మాదిగ, గువ్వల రవి మాదిగ, పాలమాకుల శ్రావణ్ మాదిగ, చెరుపల్లి కుమార్ మాదిగ, దండు ఉమేష్ మాదిగ తదితరులు పాల్గొన్నారు.