calender_icon.png 20 January, 2025 | 9:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సాధ్యం కానీ హామీలిచ్చి ప్రజల్ని మోసం చేస్తున్న కాంగ్రెస్

20-01-2025 08:03:22 PM

బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు...

ఇల్లెందు (విజయక్రాంతి): ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఆచరణ సాధ్యం కాని హామీలను ఇచ్చి ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ నేతలను ఎక్కడిక్కడ నిలదీయాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు, మాజీ శాసనసభ్యురాలు బానోత్ హరి ప్రియ ప్రజలకు పిలుపునిచ్చారు. మండల పరిధిలోని వెంకట్యతండా సమీపంలో బీఆర్ఎస్ జిల్లా నాయకులు, బేతంపూడి సొసైటీ అధ్యక్షుడు లక్కినేని సురేందర్రావు ఆధ్వర్యంలో జరిగిన బీఆర్ఎస్ మండల విస్తృతస్థాయి సమావేశానికి వారు హాజరయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇల్లందు నియోజకవర్గంలోని 138 పంచాయితీల్లో గులాబీ జెండా ఎగరడం ఖాయమని వారన్నారు. ప్రభుత్వ నిర్వాకంతో ఓట్లు అడిగేందుకు కూడా కాంగ్రెస్ నేతలు భయపడుతున్నారని వారన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు లక్కినేని సురేందర్ రావు, దిండిగాల రాజేందర్, నాయకులు బొమ్మెర్ల వరప్రసాద్, బోడ బాలు, చీమల సత్యనారాయణ, బానోత్ కిషన్, బానోత్ రామ, భూక్యా లాలునాయక్, తేజావత్ రవి తదితరులు పాల్గొన్నారు.