calender_icon.png 24 November, 2024 | 5:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజలపై భారం మోపుతున్న కాంగ్రెస్

25-10-2024 01:03:31 AM

మాజీ మంత్రి  వేముల ప్రశాంత్‌రెడ్డి

కామారెడ్డి(నిజామాబాద్),అక్టోబర్24(విజయక్రాంతి): ప్రజలపై విద్యుత్ చార్జీల భారం వేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైందని మాజీ మంత్రి  వేముల ప్రశాంత్ రెడ్డి విమర్శించారరు. రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి ఆధ్వర్యంలో నిజామాబాద్ కలెక్టరేట్‌లో గురువారం నిర్వహించిన విద్యు త్ ఛార్జీల పెంపుపై జరిగిన బహిరంగ విచారణలో ఆయన పాల్గొన్నారు.

అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ విద్యుత్ ఛార్జీల పెంపును తాము సమర్థిస్తున్నట్లు నియంత్రణ మండలి చైర్మన్ పేర్కొనడం కాంగ్రెస్ స్టాండ్‌ను తెలియజేస్తుందన్నారు. రూ.10 ఉన్న ఫిక్స్‌డ్‌గా ఉన్న ఛార్జిని రూ.50లకు పెంచడంలో ప్రజలపై తీవ్ర భారం పడుతుందన్నారు.

ఖర్చులను తగ్గించుకోవడం తెలియక విద్యుత్ చార్జీలను పెంచుతున్నారని విమర్శించారు. 300 యూనిట్లు ఉపయోగించుకునే మధ్యతరగతి ప్రజలపై భారం పడుతుందన్నారు. పెంపు నిర్ణయాన్ని తాము ఒప్పుకోబోమని కమిషన్‌కు విన్నవించినట్లు పేర్కొన్నారు. ఛార్జీల పెంపును   తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని పేర్కొన్నారు.