calender_icon.png 27 December, 2024 | 10:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మోసం చేయడంలో కాంగ్రెస్ దిట్ట

04-08-2024 12:11:06 AM

మల్కాజిగిరి ఎంపీ ఈటల 

రాజేంద్రనగర్, ఆగస్టు 3: జనాన్ని నమ్మించి మోసం చేయడంలో కాంగ్రెస్ పార్టీ దిట్ట అని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ విమర్శించారు. శంషాబాద్ తొండుపల్లిలోని ఓ ఫంక్షన్ హాలులో శనివారం బీజేపీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు బొక్క నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన పార్టీ జిల్లా విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో అలివిమాలిన హామీలు ఇచ్చి, అడ్డదారిలో అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. అధికారంలోకి వచ్చి దాదాపు ఏడు నెలలవుతున్నా ఒక్క హామీనైనా పూర్తిగా అమలు చేయలేదని మండి పడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా ఎంతో మందిరైతులకు రుణమాఫీ వర్తించలేదన్నారు. కల్లబొల్లి మాటలతో సీఎం రేవంత్‌రెడ్డి కాల గడుపుతున్నారని దుయ్యబట్టారు. చేవెళ్ల ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. స్థానిక సంస్థలను ఎన్నికలను పార్టీ నాయకులు ప్రతి ష్ఠాత్మకంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. సమావేశంలో మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్, మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం, నాయ కులు భీమార్జున్ రెడ్డి, వై.శ్రీధర్, నందకిశోర్ పాల్గొన్నారు.