calender_icon.png 15 January, 2025 | 11:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్‌వి నిరంకుశ విధానాలు

18-09-2024 03:55:00 AM

బీఆర్‌ఎస్ నేతల మండిపాటు

రాజీవ్‌గాంధీ విగ్రహ ఏర్పాటుపై నిరసనలు

రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ తల్లి విగ్రహాలకు క్షీరాభిషేకాలు

విజయక్రాంతి న్యూస్ నెట్‌వర్క్, సెప్టెంబర్ 17: కాంగ్రెస్‌వి నిరంకుశ విధానాలని, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం దెబ్బతీసేలా సీఎం రేవంత్‌రెడ్డి వ్యవహరిస్తున్నాడని బీఆర్‌ఎస్ నేతలు విమర్శించారు. సచివాలయం ఎదుట రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్‌గాంధీ విగ్ర హం ఏర్పాటు చేయడంపై బీఆర్‌ఎస్ నేతలు మండిపడ్డారు. అందుకు నిరసనగా బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఆ పార్టీ కార్యకర్తలు తెలంగాణ తల్లి విగ్రహాలకు మంగళవారం క్షీరాభిషేకం చేశారు. 

తెలంగాణ భవన్‌లో కేటీఆర్ తెలంగాణ తల్లి విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. హైదరాబాద్ రాష్ర్టం 1948 సెప్టెంబర్ 17న భారత యూనియన్‌లో కలిసిన సందర్భంగా జాతీయ జెండాను ఎగురవేశారు.  కార్యక్రమంలో మాజీ మంత్రులు గంగుల కమలాకర్, చామకూర మల్లారెడ్డి, వి శ్రీనివాస్‌గౌడ్, మహమూద్ అలీ, శాసనమండలి ప్రతిపక్ష నాయకుడు సిరికొండ మధుసూదనాచారి, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో మాజీ మం త్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడారు.

సచివాలయం ఎదుట రాజీవ్‌గాంధీ విగ్రహం ఏర్పాటు చేయడం తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ న్ని కించపరచడమే అని అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంతో పాటు బాన్సువాడ, ఎల్లారెడ్డి, జుక్కల్, ఖమ్మం జిల్లా కేంద్రంలో బీఆర్‌ఎస్ నాయకులు తెలంగాణ తల్లి విగ్రహానికి, చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కాప్రా సర్కిల్, మల్లాపూర్ డివిజన్ ఎలిఫెంట్ చౌరస్తాలో ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి కార్పొరేటర్లతో కలిసి తెలంగాణ తల్లి విగ్రహానికి - క్షీరాభిషేకం నిర్వహించారు.