సీఎం రేవంత్ మతి తప్పి మాట్లాడుతున్నారు
మల్కాజిగిరి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్
హైదరాబాద్ సిటీబ్యూరో, మే 11 (విజయక్రాంతి): కాంగ్రెస్ దేశాన్ని క్యాన్సర్‌లా పట్టి పీడిస్తోందని మల్కాజిగిరి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ విరుచుకుపడ్డారు. ఇందిరాగాంధీ నుంచి రాహుల్‌గాంధీ వరకు గరీబీ హఠావో నినాదంతోనే రాజకీయాలు చేస్తూ పబ్బం గడుపుతున్నారని విమర్శించా రు. బీజేపీ దేశానికి క్యాన్సర్ అంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ, రేవంత్ రెడ్డికి మతి తప్పిందని మండిపడ్డారు.
మహేంద్ర హిల్స్‌లోని బీజేపీ కార్యాలయంలో శనివారం ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కేసీఆర్‌పై ఉన్న వ్యతిరేకత కారణంగా కాంగ్రెస్ గెలిచింది తప్ప అందులో వారి గొప్పతనం ఏమీ లేదన్నారు. దేశాన్ని 5 దశాబ్దాలు పాలించిన కాంగ్రెస్.. పంజాబ్, జమ్మూ కశ్మీర్లో విధ్వంసం సృష్టించిందన్నారు. కాంగ్రెస్ హయాంలోనే హైదరాబాద్‌లో బాంబు పేలు ళ్లు, కుంభకోణాలు జరిగాయని తెలిపారు. పేపర్లో, టీవీల్లో రావడానికి, సంచనాల కోసం మాత్రమే రేవంత్ మాట్లాడుతుంటాడని ధ్వజమెత్తారు. పొన్నాల లక్ష్మయ్య బీఆర్ఎస్లో చేరినప్పుడు తీవ్ర వ్యాఖ్యలు చేసిన రేవంత్.. బీఆర్ఎస్ నుంచి కడియం శ్రీహరిని ఎలా చేర్చుకున్నారని ప్రశ్నించారు. 6 నెలల్లోనే రేవంత్ పాలనను ప్రజలు ఛీకొడుతున్నారన్నా రు. కంటోన్మెంట్‌ను ఎత్తేసేందుకు పార్లమెంటులో తన గళం విప్పుతానని హామీ ఇచ్చారు.