calender_icon.png 19 April, 2025 | 12:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉపాధిహామీకి తూట్లు పొడుస్తున్న కాంగ్రెస్

16-04-2025 01:04:36 AM

మాజీ మంత్రి హరీశ్‌రావు 

హైదరాబాద్, ఏప్రిల్ 15 (విజయక్రాంతి) : ఉపాధి కూలీలు, ఫీల్డ్ అసిస్టెంట్లు, ఏపీ వోలు, సీవోలకు మూడు నెలలుగా జీతాలు చెల్లించడం లేదని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆరోపించారు. చేసిన పనులకు జీతాలు రాక ఉపాధి కూలీలు, సిబ్బంది ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ, పస్తులతో జీవిస్తున్నారని ఆయన మంగళవారం ఎక్స్ వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రుల ను, అధికారులను కలసి ఎన్నిసార్లు గోడు వెల్లబోసుకున్నా ప్రయోజనం లేదన్నారు. జీతాల చెల్లింపుల్లో మంత్రుల మాటలకు, చేతలకు పొంతన ఉండటం లేదని వాపో యారు.

జీతాలు పెండింగ్‌లో పెట్టి ప్రభుత్వా న్ని నడిపిస్తున్నామని చెప్పిన సీఎం, ఉపాధి హామీ కూలీల జీతాలను ఎవరి ఖాతాల్లోకి మళ్లించారని హరీశ్‌రావు ప్రశ్నించారు. ఉపా ధి పథకం ఉద్యోగులకు తక్షణమే వేతనాలు చెల్లిస్తామని మ్యానిఫెస్టోలో చెప్పి, ఏడాదిన్న ర కావొస్తున్నా అమలు చేయడం లేదని ఆరోపించారు. మరో ట్వీట్‌లో మహిళలను కోటీశ్వరులను చేస్తామన్న హామీపై ప్రశ్నిం చారు.

కనీసం వారిని లక్షాధికారులను కూడా చేయాలని ఆరోపించారు. రుణాలపై సోమవారం మంచిర్యాల డిప్యూటీ సీఎం భట్టి అబద్ధాలు చె ప్పారంటూ ఆ వీడి యో ను పోస్ట్ చేశా రు. 2024, న వం బర్ 19న వరంగ ల్‌లో స్వ యంసహా య క సంఘ సభ్యు లకు సీఎం అందజేసిన చెక్కులనే మళ్లీ 2025, మార్చి 8న ఇందిరా మహిళా శక్తి పేరిట హైదరాబాద్‌లో సీఎం అందజే శారని హరీశ్‌రావు ఆరోపించారు. 

కడుపు తరుక్కుపోతోంది..

అకాల వర్షాలు, సాగునీటి గోస, కరెంట్ కష్టాలను ఎదుర్కొని 18 ఎకరాల్లో ఖమ్మం జిల్లా కల్లూరు మండలం పుల్లయ్య బంజ రకు చెందిన రైతు దంపతులు బొల్లం రామ య్య, చంద్రకళ వరి సాగు చేస్తే, ప్రభుత్వమే విపత్తు రూపంలో వారిని నట్టేటా ముం చిందని హరీశ్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. పంటను అమ్ముకొనేందుకు కొనుగోలు కేం ద్రానికి తరలించి 20 రోజులు గడిచినా పంట కొనుగోలు చేయలేదని చెబుతూ ఆ రైతులు ఏడుస్తున్న వీడియోను ట్యాగ్ చేస్తూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను పట్టించుకోదని చెప్పేందుకు ఈ రైతులు కన్నీరే ప్రత్యక్ష సాక్ష్యమన్నారు.