మానుకోట ఎమ్మెల్యే మురళీనాయక్
మహబూబాబాద్, జనవరి 2 (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లకు పెట్టింది పేరని మానుకోట ఎమ్మెల్యే మురళి నాయక్ పేర్కొన్నారు. గురువారం మహబూబాబాద్ పట్టణ కేంద్రం పరిధిలోని ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన ఇందిరమ్మ నమూనా ఇంటికి ఆయన ముగుపోశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పక్కా ఇండ్లు కట్టిస్తామని హామీ ఇచ్చి ఆ దిశగా కార్యాచరణ ప్రారంభించిందన్నారు. ఇచ్చిన మాట ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు రూ.6 లక్షలు, ఇతర వర్గాల వారికి రూ.5 లక్షల చొప్పున అందజేస్తున్నట్లు చెప్పారు. ఏకకాలంలో రైతులకు రెండు లక్షలు రుణమాఫీ చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామన్నారు.